AP Ration Shops: రేషన్ దుకాణాల్లో రాగులు, జొన్నలు, సజ్జలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ నుంచి పంచదార పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. 6 వేల మంది రేషన్ డీలర్ల నియామకాల్ని త్వరలో భర్తీ చేస్తామని..ధాన్యం సేకరణకు కొత్త విధానం తెస్తున్నామని అన్నారు. సెప్టెంబరు నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి అక్టోబరులో ధాన్యం సేకరణ ప్రారంభిస్తామన్నారు. ఈ క్రమంలోనే ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లోనే సొమ్ము చెల్లించాలని చంద్రబాబు ఆదేశించారు. సేకరించిన ధాన్యాన్ని సమీప మిల్లులకే పంపాలని సూచించారు.
పూర్తిగా చదవండి..AP: రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త.. జోన్నలు, సజ్జలు, రాగులతో పాటు..
రేషన్ దుకాణాల్లో రాగులు, జొన్నలు, సజ్జలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 6 వేల మంది రేషన్ డీలర్ల నియామకాల్ని భర్తీ చేస్తామని.. ధాన్యం సేకరణకు కొత్త విధానం తెస్తున్నామని తెలిపారు. సెప్టెంబరు నాటికి ఏర్పాట్లు పూర్తిచేసి అక్టోబరులో సేకరణ ప్రారంభిస్తామన్నారు.
Translate this News: