చంద్రబాబు నివాసంలో రాఖీ సంబరాలు-VIDEO
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎంకు బ్రహ్మకుమారీలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ మహిళా నేతలు చంద్రబాబుకు రాఖీ కట్టేందుకు భారీగా తరలివచ్చారు.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎంకు బ్రహ్మకుమారీలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ మహిళా నేతలు చంద్రబాబుకు రాఖీ కట్టేందుకు భారీగా తరలివచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. మీలాంటి సోదరుడు ఉండటం వల్ల ఈ ప్రపంచంలో తాను సురక్షితంగా ఉన్నానని సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. సీతక్కతో పాటు సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, రాగమయి రాఖీ కట్టారు.
TG: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ ఉన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న మాజీ మాజీ అడిషినల్ ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. 15 రోజుల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. హైదరాబాద్ విడిచి వెళ్లోద్దని ఆదేశాలు ఇచ్చింది.
గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒంగోలు నియోజకవర్గంలోని 12 పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను తిరిగి లెక్కిస్తున్నారు. మాజీ మంత్రి బాలినేని ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ ఈ చర్యలు చేపట్టింది. నాలుగు రోజుల పాటు ఈవీఎంల లెక్కింపు జరుగుతుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
TG: ఆర్టీసీ బస్సులో గర్భిణికి ఓ లేడీ కండక్టర్ డెలివరీ చేసింది. గద్వాల-వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సులో తన సోదరులకు రాఖి కట్టేందుకు వెళ్తున్న సంధ్య అనే మహిళలకు పురుటి నొప్పులు రాగా, కండక్టర్ వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు.
ఎల్లుండి భారత్ బంద్‌కు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఆరోజు నిరసన చేపట్టనున్నారు. సుప్రీం కోర్టు తీర్పు వల్ల తమ హక్కులకు భంగం వాటిల్లుతోందని సమితి సభ్యులు పేర్కొన్నారు.
AP: ఈరోజు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సోమశిల జలాశయాన్ని పరిశీలిస్తారు. అనంతరం శ్రీసిటీలో పరిశ్రమలకు భూమిపూజతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
చంద్రబాబు, నితీష్ కుమార్ దయతోనే దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉందని సీపీఐ నారాయన అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న నరేంద్ర మోదీ దేశంలో ఆర్థిక మాఫియా నడిపిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.