YSRCP: సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఆ జిల్లాలకు అధ్యక్షుల నియామకం
వైసీపీ అధినేత వైఎస్ జగన్.. జిల్లా, నగర పార్టీ అధ్యక్షులను నియమించారు. అనంతపురం, సత్యసాయి, తూర్పు గోదావరి జిల్లాలకు అలాగే రాజమండ్రి నగరానికి పార్టీ అధ్యక్షులను నియమించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్.. జిల్లా, నగర పార్టీ అధ్యక్షులను నియమించారు. అనంతపురం, సత్యసాయి, తూర్పు గోదావరి జిల్లాలకు అలాగే రాజమండ్రి నగరానికి పార్టీ అధ్యక్షులను నియమించారు.
ప్రజలను వరదల్లో ముంచేసి ఏపీ మంత్రులంతా విహార యాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారని మాజీ మంత్రి రోజా అన్నారు. విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుందంటూ ఎమోషనల్ అయ్యారు. ఇంత మంది ప్రాణాలు పోవడానికి కూటమి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటించకపోవడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తాను వస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు చెప్పారని.. అందుకే రాలేకపోయానని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ తమ పార్టీ మంత్రులు, ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయడంలో యాక్టీవ్‌గా ఉండాలని చెప్పారు.
ముంబై నటి కాదంబరి జెత్వానీ ఇష్యూలో మాజీ సీఎం జగన్ ప్రమేయం ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. జెత్వానీ నోరు మూయించడానికి సజ్జన్ జిందాల్, జగన్ ప్లాన్ చేశారని ఆరోపించారు. ఇద్దరు కూతుళ్లున్న జగన్ ఆమె విషయం ఎందుకు ఆలోచించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అక్టోబర్ 5న హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తులో భాగంగా తమకు 20 సీట్లు కేటాయించాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో సందిగ్ధత నెలకొంది.
తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్, ముగ్గురు సభ్యులతో విద్యా కమిషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రిన్సిపల్ సెక్రెటరి బుర్ర వేంకటేశం తెలిపారు. విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు విద్య వ్యవస్థలో పలు మార్పులు చేయబోతున్నట్లు చెప్పారు.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో హైడ్రా తరహా వ్వవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. త్వరలోనే చెరువుల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కబ్జాలపై ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై యాక్షన్ తీసుకుంటామన్నారు.