TG Education Commission: తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ! తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్, ముగ్గురు సభ్యులతో విద్యా కమిషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రిన్సిపల్ సెక్రెటరి బుర్ర వేంకటేశం తెలిపారు. విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు విద్య వ్యవస్థలో పలు మార్పులు చేయబోతున్నట్లు చెప్పారు. By srinivas 03 Sep 2024 in జాబ్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి Education Commission: తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్, ముగ్గురు సభ్యులతో విద్యా కమిషన్ ఏర్పాటైంది. విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు పలు మార్పులు చేసేందుకు కొత్త కమిషన్ ఏర్పరచినట్లు ప్రిన్సిపల్ సెక్రెటరి బుర్ర వేంకటేశం తెలిపారు. ఈ మేరకు ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ రూపొందించడం కోసం విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే చైర్మన్‌ను, కమిషన్ సభ్యులను నియమించనుండగా.. రాష్ట్రంలో విద్యా రంగాన్ని పలుమార్పులతో పాటు బలోపేతం చేసేందుకు ఈ కమిషన్ దృష్టి సారించనుంది. ఇక దీనిపై వేంకటేశం మాట్లాడుతూ.. విద్య నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో కొన్ని తీవ్రమైన సమస్యలున్నట్లు మా దృష్టికి వచ్చింది. పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాల మెరుగుపరిచి.. నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (NAS)-2021 ప్రకారం విద్యార్థుల అభ్యాస ఫలితాలపై దృష్టి కేంద్రీకరిస్తాం. పరిశోధనా నైపుణ్యాల లేమి కారణంగా విశ్వవిద్యాలయ స్థాయి తగ్గిపోతుంది. ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్య నాణ్యతను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగాన్ని సంస్కరించాల్సి ఉందన్నారు. #telangana #tg-new-education-commission #burra-venkatesham మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి