సర్పంచ్ పదవికి వేలం పాట.. రూ.2 కోట్లకు బీజేపీ నేత ఏకగ్రీవం!

పంజాబ్ రాష్ట్రంలో సర్పంచ్ పదవిని వేలం వేయడం చర్చనీయాంశమైంది. అక్టోబరు 15న ఎన్నికలు జరగనుండగా హర్దోవల్‌ కలన్‌ గ్రామ సర్పంచ్‌గా స్థానిక బీజేపీ నేత ఆత్మాసింగ్‌ రూ.2 కోట్లకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమాచారం. దీపిపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.  

New Update
derererr

Sarpanch Election: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. సర్పంచ్ సీటు కోసం ఇప్పటికే పలువురు నాయకులు పావులు కదుపుతుండగా పలు స్థానాలు ఏకగ్రీవమైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగానే పంజాబ్ రాష్ట్రంలో సర్పంచ్ పదవిని వేలం పాట వేయడం చర్చనీయాంశమైంది. 

అక్టోబరు 15న ఎన్నికలు..

ఈ మేరకు పంజాబ్‌ లో 13,237 సర్పంచ్ స్థానాలకు అక్టోబరు 15న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లను సమర్పించేందుకు అక్టోబరు 4వ తేదీ తుది గడువు. పోలింగ్‌ ముగిసిన తర్వాతే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ క్రమంలోనే గురుదాస్‌పుర్‌లోని హర్దోవల్‌ కలన్‌ గ్రామంలో సర్పంచ్ పదవి కోసం వేలం పాట నిర్వహించారు. మొదట రూ.50లక్షలతో మొదలైన వేలంగాపాట కోట్ల రూపాయలకు చేరుకుంది. అక్కడి స్థానిక బీజేపీ నాయకుడు ఆత్మాసింగ్‌ ఏకంగా రూ.2 కోట్లకు సర్పంచ్ సీటు సొంతం చేసుకున్నాడు. గ్రామానికి నిధులు ఎక్కువగా తీసుకొచ్చేవారే సర్పంచ్ పదవికి అర్హులని, అలాంటి వారినే ప్రజలు ఎన్నుకుంటారని ఈ సందర్భంగా ఆత్మాసింగ్ చెప్పారు.

ఈ ఎన్నిక అధికారికం కాదు..

అయితే ఈ వేలం పాట తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఎన్నిక అధికారికం కాదు. ఇది బహిరంగ అవినీతి. దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టి బాధ్యులను శిక్షించాలంటూ కాంగ్రెస్‌ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై దర్యాప్తునకు జిల్లా కలెక్టర్‌ ఆదేశించగా సర్పంచి ఎన్నికకు ఆత్మాసింగ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఇక పంజాబ్ లో సర్పంచ్ పదవి వేలం వేయటం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు బఠిండాలోని గెహ్రి బత్తార్‌ గ్రామంలో సర్పంచ్ పదవి రూ.60 లక్షలు పలికినట్లు అప్పట్లో చర్చనీయాంశమైంది. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు