CJI-Modi: న్యాయవ్యవస్థపై తప్పుడు సంకేతమే.. మోదీపై ప్రశాంత్ భూషణ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజకు హాజరైన ప్రధాని మోదీ చర్యను న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తప్పుబట్టారు. వీరిద్దరూ న్యాయమూర్తుల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టే. ఇలా చేస్తే న్యాయవ్యవస్థపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ప్రశాంత్ భూషణ్ అన్నారు. By srinivas 12 Sep 2024 | నవీకరించబడింది పై 12 Sep 2024 14:05 IST in రాజకీయాలు నేషనల్ New Update షేర్ చేయండి PM Modi: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజకు హాజరైన ప్రధాని మోదీ చర్యను ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తప్పుబట్టారు. వీరిద్దరూ న్యాయమూర్తుల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టేనని ఆయన అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వీడియో షేర్ చేసిన ప్రశాంత్ భూషణ్.. ‘ప్రైవేట్ మీట్ కోసం సీజేఐ చంద్రచూడ్ ప్రధాని మోదీని అహ్వానించడం దిగ్భ్రాంతికరం. రాజ్యాంగ పరిధిలో పనిచేసే న్యాయవ్యవస్థపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. My statement on the PM visiting the CJI for Ganesh puja at his residence pic.twitter.com/kcqCfNsfGz — Prashant Bhushan (@pbhushan1) September 12, 2024 Also Read : హైడ్రాకు షాక్.. ఢిల్లీలో మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు! Also Read : కేబినెట్ విస్తరణకు సిద్ధమైన రేవంత్.. వారికి ఛాన్స్! ఈ మేరకు బుధవారం రాత్రి చంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన గణపతి పూజలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాన మంత్రికి చంద్రచూడ్, ఆయన సతీమణి కల్పనాదాస్ సాదర స్వాగతం పలికారు. మహారాష్ట్ర సంప్రదాయ టోపీ ధరించి మోదీ పూజలు చేశారు. విఘ్నేశ్వరుడు మనందరికీ ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని కోరినట్లు చెప్పారు. Joined Ganesh Puja at the residence of CJI, Justice DY Chandrachud Ji. May Bhagwan Shri Ganesh bless us all with happiness, prosperity and wonderful health. pic.twitter.com/dfWlR7elky — Narendra Modi (@narendramodi) September 11, 2024 Also Read : నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు: నటి హేమ అలాగే మాజీ అడ్వొకేట్ జనరల్ ఇందిరా జైసింగ్, శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌లు విమర్శలు గుప్పించారు. ‘కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ మధ్య అధికార విభజన విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి రాజీపడ్డారు. సీజేఐ స్వాతంత్ర్యంపై విశ్వాసం కోల్పోయింది. కార్యనిర్వాహక వ్యవస్థతో తన స్వతంత్ర విషయంలో సీజేఐ బహిరంగంగా రాజీ పడిన విషయాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తప్పనిసరిగా ఖండించాలి’ అని కోరుతూ బార్ అసోసియేషన్ ఛైర్మన్ కపిల్ సిబల్‌ను ట్యాగ్ చేశారు. Also Read : ఆడపిల్లను కిడ్నాప్ చేశారంటూ బెదిరింపు కాల్స్..జాగ్రత్త #pm-modi #cji మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి