Sitaram Echuri :
సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం మధ్నాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నెల 19న ఆయన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. చివరికి ఆయన ఆరోగ్య పరిస్థితి గురువారం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. దీంతో వామపక్ష వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పార్టీ సభ్యులు, నేతలు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అభిమానుల సందర్శనార్థం ఏచూరి పార్థివదేహాన్ని ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కు శనివారం తీసుకువచ్చారు. అక్కడ ఆయనకు పలువురు నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఆయన భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ కి తరలించనున్నారు.
మధ్యాహ్నం 3 గంటల వరకు ఏచూరి పార్థివదేహం ఏకేజీ భవన్‌లోనే ఉంచనున్నారు. సాయంత్రం 4 నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. అనంతరం ఆయన పార్థివదేహాన్ని ఎయిమ్స్‌కు అప్పగించనున్నారు.
ఢిల్లీ సీపీఎం కార్యాలయంలో సీతారాం ఏచూరి పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. కేరళ సీఎం పినరాయి విజయన్, సోనియా గాంధీ, ప్రకాష్ కారత్, బృందా కారత్, బీవీ రాఘవులు, మాజీ ఎంపీ మధుతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఏచూరి పార్థివ దేహానికి నివాళులర్పించారు.
Also Read: విశాఖకు మరో వందేభారత్..ఎప్పుడు ప్రారంభం అంటే!