/rtv/media/media_files/2026/01/28/pavan-kalyan-2026-01-28-13-03-04.jpg)
Pavan kalyan
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సొంత పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉండటంతో జనసేన పార్టీ నాయకత్వం వెంటనే స్పందించింది. ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని విచారణకు ఆదేశించింది. టి.శివశంకర్, తంబళ్ళపల్లి రమాదేవి, టి.సి. వరుణ్ నేతలతో కలిపి పార్టీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఏడు రోజుల్లోగా కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆరవ శ్రీధర్‌కు పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఆరోపణలపై నిజనిజాలు విచారణ చేసి కమిటీ పార్టీకి నివేదిక ఇవ్వనుంది. దీని ప్రకారం శ్రీధర్‌ను పార్టీలో ఉంచాలా? తొలగించాలా? అనే నిర్ణయం తీసుకోనుంది. అయితే ఈ విచారణ పూర్తి అయ్యేంత వరకు ఎమ్మెల్యే శ్రీధర్‌పై పార్టీ తాత్కాలిక చర్యలు తీసుకోనుంది. విచారణ కమిటీ తన నివేదికను సమర్పించి, పార్టీ తుది నిర్ణయం తీసుకునే వరకు ఆయన ఎటువంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని జనసేన ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చూడండి: Ajith Pawar Plane Crash: అజిత్ పవార్ ప్రయాణించిన విమానం 'లీర్జెట్ 45' వివరాలు.. గతంలో కూడా ఇదే విమానానికి ఘోర ప్రమాదం!
రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై విచారణకు కమిటీ. pic.twitter.com/Qw9ydOidyg
— JanaSena Party (@JanaSenaParty) January 28, 2026
అసలు ఏమైందంటే?
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఓ దళిత మహిళ ఆరోపణలు చేసింది. శ్రీధర్ కారులో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత మహిళ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అయితే ఈమె కంటే ముందు మరో ఏడుగురిపై కూడా అత్యాచారం చేసినట్లు బాధిత మహిళ వెల్లడించింది. ఈ క్రమంలోనే జనసేన పార్టీ శ్రీధర్‌పై తాత్కాలిక వేటు విధించి విచారణకు కమిటీ ఆదేశించింది.
ఇది కూడా చూడండి: Ajit Pawar: అజిత్ పవార్ జీవితం: విద్య, కుటుంబం, ఆస్తులు, రాజకీయ ప్రయాణం పూర్తి వివరాలు ఇవే!
Follow Us