తెలంగాణ ప్రభుత్వం ఒక రాష్ట్రం.. ఒకే గుర్తింపు కార్డు విధానంలో భాగంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు సికింద్రాబాద్‌లో నిర్వహించారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో ఎక్కడైనా సులభంగా సేవలు పొందేందుకు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వేను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే హైడ్రా, మూసీ ప్రాజెక్టును తీసుకొస్తున్నామని తెలిపారు. కిరాయి మనుషులతో బీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న హడావుడి తెలంగాణ సమాజం గమనిస్తోంది.
ఇది కూడా చూడండి: మా గ్రామానికి ఆంజనేయస్వామి వచ్చాడోచ్.. ఎలా అంటే?
అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు
పదేళ్ల పాటు దోచుకున్న సొమ్ము మీ పార్టీ ఖాతాలో రూ.1500 కోట్లు వాడకుండా ఉన్నాయని, అందులోంచి ఒక రూ.500 కోట్లు మూసీ ప్రాంత పేదలకు పంచి పెట్టండని రేవంత్ రెడ్డి అన్నారు. లేకపోతే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో చెప్పండి.. వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అసెంబ్లీలో హైడ్రాపై చర్చ జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదని బీఆర్‌ఎస్ పార్టీని ప్రశ్నించారు. మూసీ మురికిలో ఉన్న పేదలకు ఇళ్లు, రూ.25వేలు ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నామని రేవంత్ అన్నారు. ఫామ్ హౌస్‌లను కాపాడుకోవడానికి కేటీఆర్ పేదల ముసుగు అడ్డం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు.
ఇది కూడా చూడండి: సారీ చెప్పిన వెన్కక్కి తగ్గేదిలే.. సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్న నాగార్జున
కేటీఆర్ అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌజ్‌లు కూల్చాలా వద్దా? సబితమ్మ ముగ్గురు కొడుకుల ఫామ్ హౌస్‌లు కూలగొట్టాలా వద్దా? అని రేవంత్ అన్నారు. ఫామ్ హౌస్‌లు కూలుతాయనే కేటీఆర్ పేదలను అడ్డు పెట్టుకుంటున్నారన్నారు. నల్ల చెరువులో మూసీ నది ఒడ్డున ప్లాట్లు చేసి విక్రయించింది మీ పార్టీ నాయకులే కాదా? 20 ఏళ్ల నుంచి ప్రజల్లో తిరుగుతున్న నాకు పేదల కష్టాలు తెలియదా? అని అన్నారు. మూసీ నదిని అడ్డు పెట్టుకుని ఎన్నిరోజులు తప్పించుకుంటారన్నారు. జవహర్ నగర్‌లో ఉన్న 1000 ఎకరాలను పేదలకు పంచుదామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించారు.
ఇది కూడా చూడండి: ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే.. నేటి నుంచి ప్రారంభం