Andhra Pradesh: అమరావతి పనులను తిరిగి ప్రారంభించిన సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ రాజధాని అమరావతి పనులను పున:ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెండింగ్‌లో ఉన్న సీఆర్డీఏ కార్యాలయం పనులను తిరిగి స్టార్ట్ చేశారు. తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెం వద్ద చంద్రబాబు పూజలు నిర్వహించారు.

New Update

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు తిరిగి ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో 2017లో రూ.160 కోట్లతో ఎనిమిది అంతస్తుల సీఆర్డీఏ కార్యాలయ పనులను తిరిగి ప్రారంభించారు. మధ్యలో ఆగిపోయిన పనులను పున:ప్రారంభించారు. తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెం వద్ద చంద్రబాబు పూజలు నిర్వహించారు.

ఇది కూడా చూడండి: Rotten Chicken: స్పెషల్ చికెన్‌.. తింటే ఇక నో డౌట్ చావు ఖాయం!

చరిత్రను తిరగరాయడానికి..

మొత్తం 3.62 ఎకరాల్లో జీ ప్లస్ 7 అంతస్తులతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. అదనంగా ల్యాండ్ స్కేపింగ్, పార్కింగ్ కు 2.51 ఎకరాలు కేటాయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. చరిత్రను తిరగరాయడానికి ఇక్కడ అందరం సమావేశం అయ్యామన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్ర ప్రజలంతా ఇబ్బంది పడ్డారని తెలిపారు. 

ఇది కూడా చూడండి: ఢిల్లీ మద్యం కుంభకోణం .. వర్చువల్‌గా హాజరుకానున్న కవిత

హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత తమదేనని తెలిపారు. ముందు చూపుతో ఆలోచించి సైబరాబాద్‌లో 8 వరుసల్లో రోడ్లు వేశామన్నారు. అప్పుడు శంషాబాద్ విమానాశ్రయానికి 5 ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. చాలా మంది అడ్డు పడ్డారు. ఏదైనా మంచి పనిచేస్తే అడ్డు పడేవారు ఎక్కడైనా ఉంటారని తెలిపారు. రైతులను ఒప్పించి రాజధాని కోసం భూములను సేకరించాం. మొత్తం 54 ఎకరాలను అమరావతి కోసం సేకరించామని తప్పకుండా రాజధాని కట్టి తీరుతామని చంద్రబాబు అన్నారు.

ఇది కూడా చూడండి: ప్రేమ నిరాకరించిందని.. ఇంటర్ అమ్మాయిని దారుణంగా చంపిన యువకుడు!

ప్రపంచంలో టాప్ 5 సిటీలలో అమరావతిని ఒకటిగా చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్యెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ కూడా హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పరిపాలన సరిగ్గా చేయలేదని, పోలీసుల పరిపాలన చేసిందన్నారు.

ఇది కూడా చూడండి: ED: అక్రమంగా దోచుకున్న డబ్బు.. మొదటిసారి రౌడీ షీటర్ ఆస్తులు జప్తు

#chandrababu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe