లడ్డూ వివాదంపై పవన్‌ను ట్యాగ్ చేస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్

లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్‌కు ట్యాగ్ చేస్తూ సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌ ట్వీట్ చేశారు. వివాదంపై లోతుగా దర్యాప్తు చేయాలని సూచించారు. దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

author-image
By V.J Reddy
New Update
LADDU

Laddu Issue: దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వివాదంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని సర్వత్రా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల ప్రసాదం అపవిత్రం అవుతున్నట్లు వస్తున్న వార్తలు కలవరపెడుతున్నాయి అంటూ రాహుల్ గాంధీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. స్వామి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవ్యం అని అన్నారు. లడ్డూ వ్యవహారం ప్రతి భక్తుడిని బాధిస్తోందని చెప్పారు. దీనిపై లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆలయాల పవిత్రతను కాపాడాలని ట్విట్టర్‌లో రాహుల్ పోస్ట్ చేశారు.

పవన్ ను ప్రకాష్ రాజ్...

లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్‌కు ట్యాగ్ చేస్తూ సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌ ట్వీట్ చేశారు. వివాదంపై లోతుగా దర్యాప్తు చేయాలని సూచించారు. దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భక్తులను ఎందుకు భయాందోళనకు గురి చేస్తున్నారని అని ఫైర్ అయ్యారు. మరోవైపు లడ్డూ వివాదంపై కూటమి, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గత ప్రభుత్వంలో లడ్డూ కల్తీ అయిందని టీడీపీ.. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే ఆరోపణలు అని వైసీపీ అంటోంది.

తొలిసారి జగన్...

తిరుమలలో నెయ్యి కల్తీ అంటూ సీఎం చంద్రబాబు డైవెర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు జగన్. రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకునే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. నెయ్యి కి బదులు జంతువుల కొవ్వుతో లడ్డూ తాయారు చేశారంటూ.. సీఎం గా ఉన్న వ్యక్తి మాట్లాడడం కరెక్టేనా? అని ప్రశ్నించారు. కోట్ల మంది భక్తుల మనోభావాల ను దెబ్బతీయడం సబబేనా? అని నిలదీశారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు అల్లుకున్న కట్టు కథలు ఇవి అని  ఫైర్ అయ్యారు. ప్రతీ 6 నెలలకు ఓసారి నెయ్యి స ర ఫ రా కోసం టెండర్లు పిలుస్తారన్నారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్షను ఎవరూ మార్చలేదని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతుల్లోనే తిరుమలలో లడ్డూ తయారీ జరిగిందన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు