Rajadhani Files: 'రాజధాని ఫైల్స్'సినిమా ప్రదర్శన నిలిపివేత.. ఆందోళనకు దిగిన అభిమానులు

'రాజధాని ఫైల్స్' సినిమా ప్రదర్శనను పోలీసులు నిలిపివేశారు. రేపటి వరకు మూవీ రిలీజ్‌ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ మేకర్స్ సినిమా విడుదల చేశారు. దీంతో తక్షణమే చిత్ర ప్రదర్శనలు ఆపాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

New Update
Rajadhani Files: 'రాజధాని ఫైల్స్'సినిమా ప్రదర్శన నిలిపివేత.. ఆందోళనకు దిగిన అభిమానులు

Rajadhani Files: రాష్ట్రవ్యాప్తంగా 'రాజధాని ఫైల్స్' సినిమా ప్రదర్శనను పోలీసులు నిలిపివేశారు. రేపటి వరకు మూవీ రిలీజ్‌ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ మేకర్స్ సినిమా విడుదల చేశారు. దీంతో తక్షణమే చిత్ర ప్రదర్శనలు ఆపాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సినిమా విడులైన థియేటర్లకు చేరుకుని పోలీసులు షోలను అడ్డుకున్నారు.

ప్రేక్షకులు ఆగ్రహం..
ఈ మేరకు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శిస్తోన్న థియేటర్లకు వెళ్లి ఆపేశారు. విజయవాడలో పలు థియేటర్లలో సినిమాను మధ్యలో నిలిపివేశారు. బెంజి సర్కిల్​లోని ట్రెండ్ సెట్ మాల్​కు వెళ్లిన రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రదర్శన నిలిపివేయడంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు స్టే ఇచ్చిన కారణంగా ప్రదర్శన నిలిపేస్తున్నట్లు బదులిచ్చారు. స్టే ఆర్డర్ కాపీ చూపించాలని పలువురు ప్రేక్షకులు నిలదీయగా అధికారులు సమాధానం ఇవ్వలేదు. ఆర్డర్ కాపీ లేకపోవడంతో సినిమా ఎలా ఆపుతారని నిలదీశారు. దీంతో సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని లేనిపక్షంలో తీవ్ర చర్యలు తీసుకుంటామని థియేటర్ యజమానులను పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హెచ్చరించారు.

ఇది కూడా చదవండి : Crime: తెనాలిలో దారుణం.. వివాహితను గొంతు కోసి చంపిన దుండగులు

టికెట్‌ డబ్బులు వాపస్..
ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు రాజధాని ఫైల్స్‌ సినిమా ఆట మధ్యలో నిలిపేయడంతో ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. సీఐ వచ్చి కోర్టు స్టే ఇచ్చిందని, ప్రదర్శన నిలపి వేయాలని కోరారు. లిఖితపూర్వకమైన ఆదేశాలు ఇవ్వాలని థియేటర్‌ సిబ్బంది కోరగా, అలాంటివి ఏమీ లేవంటూ ప్రదర్శనను బలవంతంగా నిలిపివేసారు. యాత్ర సినిమాలో లేని అభ్యంతరాలు రాజధాని ఫైల్స్ సినిమాలో కనిపించాయా అంటూ పలువురు ప్రేక్షకులు ప్రశ్నించారు. ప్రేక్షకులు ఆందోళన చేయడంతో థియేటర్‌ యజమాని టికెట్‌ డబ్బులు తిరిగి చెల్లించారు.

Advertisment
తాజా కథనాలు