Andhra Pradesh: ఇదెక్కడి డ్యూటీ సామీ.. మురుగు నీటికి పోలీసుల కాపలా..!

రాజకీయ నాయకులు పంచాయితీ.. పోలీసులకు తలనొప్పిగా మారింది. కాకినాడలోని గోకివాడ గ్రామంలో డ్రైనేజీకి పోలీసులు కాపాలాగా ఉన్నారు. డ్రైనేజీ నిర్మాణ పనుల విషయంలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణే ఇందుకు కారణం.

New Update
Andhra Pradesh: ఇదెక్కడి డ్యూటీ సామీ.. మురుగు నీటికి పోలీసుల కాపలా..!

Andhra Pradesh: 'రక్షక భటులు'.. పేరులోనే ఉంది రక్షకులు అని. పోలీసులు సాధారణ పౌరులకే కాదు.. అన్నింటికీ రక్షకులే.. ఆఖరికి రోడ్డుపై నిలిచిన మురుగు నీటికి కూడా రక్షకులే. ఏంటీ.. మురుగునీటికి పోలీసులు రక్షకులా? అదెలా? అని బుర్ర గీక్కుంటున్నారా? నిజంగా నిజం. రోడ్డుపై నిలిచిన మురుగునీటికి పోలీసులు కాపలాగా నిలిచారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఒక బ్యాచ్ సెక్యూరిటీగా ఉంది. మరి మురుగు నీటికి పోలీసులు సెక్యూరిటీగా ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఈ ఘటన ఎక్కడ జరిగింది? వివరాలు తెలుసుకుందాం..

కాకినాడ జిల్లా పిఠాపురం మండలం గోకివాడ వైసీపీలో ఆధిపత్య వర్గపోరు.. పోలీసులకు తలనొప్పిగా మారింది. ఓ వర్గంపై కోపం.. మరో వర్గం మురుగు నీరు వెళ్లే మార్గాన్ని మూసివేసింది. ఈ విషయంలో పెద్ద వివాదమే నడుస్తోంది. ఆరు నెలలుగా ఊరు మధ్య మురికి నీటిలోంచే నడిచి వెళ్తున్నారు ఎస్సీ కాలనీ వాసులు. ఈ మురుగు నీరు కారణంగా ప్రజలు తరచుగా వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సమస్యపై 3 నెలలుగా స్థానిక ఎమ్మెల్యే వద్ద పంచాయితీ నడుస్తోంది. అయిన్పటికీ.. ఇరు వర్గాల మధ్య విభేదాలు కొలిక్కి రాలేదు. ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడుతుంటే.. ఉద్దేశపూర్వకంగానే అవుట్ లెట్‌ను మూసివేశారని ఒక వర్గం వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన పోలీసులు.. ఘర్షణలు జరుగకుండా మురికి కాలువ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగా, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వైసీపీలో సర్పంచ్ వర్గం డ్రైనేజీ నిర్మాణ పనులు చేస్తుంటే.. మరొక వర్గం అడ్డుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. పారిశుధ్యం ఇంత అధ్వానంగా ఉండి ప్రజలు రోగాలబారిన పడిన అధికారపార్టీ నాయకులు పట్టించుకోకుండా కాలయాపన చేయడంపై వర్మ మండిపడ్డారు. వారం రోజుల్లో సమస్య క్లియర్ చెయ్యకపోతే మండలం ఆఫీస్‌లో మురికిని వేస్తామని డెడ్ లైన్ విధించి హెచ్చరించారు వర్మ.

Also read:

మిర్యాలగూడలో ఐటీ దాడులు.. భాస్కరరావు టార్గెట్‌గా సోదాలు..

ఎమ్మెల్సీ కవిత మాస్ డ్యాన్స్.. తగ్గేదేలే అంటున్న గులాబీ శ్రేణులు..!

Advertisment
తాజా కథనాలు