/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/pinnelli-1.jpg)
AP Politics : ఏపీ (Andhra Pradesh) లో సార్వత్రిక ఎన్నికల (General Elections) రోజైన మే 13న మాచర్ల వైసీపీ (YCP) ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ఈవీఎం ధ్వసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే కోసం పోలీసులు గాలింపు కొనసాగుతుంది. బుధవారం ఆయన్ను తెలంగాణ (Telangana) లో అరెస్ట్ చేసినట్లు వార్తలు రాగా.. సంగారెడ్డి ఎస్పీ అవి అవాస్తవమని పోలీసులు ఖండించారు.
ఈవీఎం ధ్వంసం తర్వాత ఆయన పక్కా ప్లాన్‌తోనే పరారైనట్లు పోలీసులు నిర్థారణకు వచ్చినట్లు వివరించారు. పోలింగ్ రోజు తన నియోజకవర్గంలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన తరువాత పిన్నెల్లి తన సోదరుడితో కలిసి హైదరాబాద్ పరారైనట్లు తెలుస్తుంది. మొదట తాము ఎక్కడికి పారిపోలేదని పిన్నెల్లి నుంచి సమచారం వచ్చింది.
కానీ గత కొన్ని రోజుల నుంచి మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే ఆచూకీ తెలియడం లేదు. కేసులు, అరెస్ట్ భయంతో పిన్నెల్లి ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also read: రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జీఎం!