Rohit Vemula : రోహిత్ వేముల సూసైడ్ కేసుపై పోలీసుల సంచలన రిపోర్టు..

2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల కేసును పోలీసులు ముగించారు. రోహిత్ ఎస్సీ కాదని.. అతని ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని తేల్చిచెప్పారు. వీసీ అప్పారావుకు ఇందులో ఎలాంటి సంబంధం లేదన్నారు.

New Update
Rohit Vemula : రోహిత్ వేముల సూసైడ్ కేసుపై పోలీసుల సంచలన రిపోర్టు..

Suicide Case : తెలంగాణ(Telangana) లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) లో రోహిత్ వేముల(Rohit Vemula) ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 2016 జనవరిలో రోహిత్ సూసైడ్ చేసుకోగా.. దీని వెనుక కుల వివక్షే కారణమని పలువురు అగ్రవర్ణాలకు చెందినవారిపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుపై కొన్నేళ్లుగా విచారణ జరుగుతూనే ఉంది. అయితే తాజాగా పోలీసులు ఎట్టకేలకు ఈ కేసును ముగించారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని తేల్చిచెప్పారు. ఆత్మహత్యకు గల కారణాలు, ఆధారాలు లేవని వెల్లడించారు.

Also Read: తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్..చల్లబడనున్న వాతావరణం

యూనివర్సిటీ వీసీ అప్పారావుకు కూడా ఎలాంటి సంబంధం లేదన్నారు. అలాగే అసలు రోహిత్ వేముల ఎస్సీ కాదని పేర్కొన్నారు. తనది ఫేక్ ఎస్సీ సర్టిఫికేట్ అని తేలితే సాధించిన డిగ్రీలు కోల్పోవడంతో పాటు.. శిక్ష పడుతుందనే భయంతో సూసైడ్ చేసుకొని ఉండొచ్చని భావించారు. ఈ కేసు రిపోర్టును పోలీసులు హైకోర్టు(High Court) కు సమర్పించారు.

Also Read: బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి హైకోర్టు బిగ్ షాక్.. ఎన్నిక రద్దు చేస్తూ సంచలన తీర్పు!

Advertisment
తాజా కథనాలు