Local Boy Nani: ఫిషింగ్ హర్బర్ అగ్నిప్రమాదంలో మరో ట్విస్ట్.. లోకల్ బాయ్ నానిని విడుదల

విశాఖ ఫిషింగ్ హర్బర్‌ అగ్నిప్రమాదం వెనుక అనుమానితుడిగా భావించిన లోకల్ బాయ్‌ నానిని పోలీసులు విడుదల చేశారు. మూడు రోజుల పాటు నాని పోలీసుల అదుపులోనే ఉన్నాడు. పోలీసులు నానిని బంధించారని అతని స్నేహితులు హైకోర్టులో పిటిషన్ వేయడంతో తాజాగా పోలీసులు అతడిని విడుదల చేశారు.

Local Boy Nani: ఫిషింగ్ హర్బర్ అగ్నిప్రమాదంలో మరో ట్విస్ట్.. లోకల్ బాయ్ నానిని విడుదల
New Update

విశాఖ ఫిషింగ్ హర్బర్‌ అగ్నిప్రమాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇప్పటివరకు అనుమానితుడిగా భావించిన యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని పోలీసులు విడుదల చేశారు. అయితే ఈ అగ్నిప్రమాదానికి నానియే కారణం అని ముందుగా జోరుగా ప్రచారం జరిగింది. దీంతో అతడు మూడు రోజుల పాటు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో నానిని పేలీసులు విచారించారు. అయితే నానిని పోలీసులు బంధించారని అతని స్నేహితులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో పోలీసులు నానిని విడుదల చేశారు. అయితే తనపై తప్పుడు ప్రచారం చేశారని నాని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే ఫిషింగ్‌ హర్బర్‌లో అగ్నిప్రమాదానికి గల కారణం ఏంటీ అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

Also Read: ఏపీలో రోడ్ల దుస్థితిపై స్వయంగా వీడియో తీసిన వైసీపీ ఎంపీ.. ఏం చేశాడంటే..?

ఇదిలాఉండగా నవంబర్‌ 19న అర్ధరాత్రి ఫిషింగ్‌ హర్బర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాదాపు 60 నుంచి 70 బోట్ల వరకు మంటల్లో దగ్ధమయ్యాయి. అయితే ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి లోకల్ బాయ్ నాని యూట్యూబ్‌లో పెట్టడంతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో ఇప్పుడు తాజాగా అతడ్ని విడుదల చేశారు.

#local-boy-nani #telugu-news #andhar-pradesh-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe