Local Boy Nani: ఫిషింగ్ హర్బర్ అగ్నిప్రమాదంలో మరో ట్విస్ట్.. లోకల్ బాయ్ నానిని విడుదల
విశాఖ ఫిషింగ్ హర్బర్ అగ్నిప్రమాదం వెనుక అనుమానితుడిగా భావించిన లోకల్ బాయ్ నానిని పోలీసులు విడుదల చేశారు. మూడు రోజుల పాటు నాని పోలీసుల అదుపులోనే ఉన్నాడు. పోలీసులు నానిని బంధించారని అతని స్నేహితులు హైకోర్టులో పిటిషన్ వేయడంతో తాజాగా పోలీసులు అతడిని విడుదల చేశారు.