Kumari Aunty Food Point Closed: ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతున్నపేరు కుమారీ ఆంటీ . "1000 అయ్యింది 2 లివర్స్ ఎక్స్ట్రా కదా బాబు" అని ఈమె చెప్పిన డైలాగ్ రీల్స్ , మీమ్స్ లో ఫుల్ వైరలవుతుంది. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న కుమారి ఆంటీ (Kumari Aunty) సోషల్ మీడియా పుణ్యమాని సెలెబ్రెటీగా మారిపోయింది. 2011 లో మాదాపూర్ (Madhapur) లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా 5 కేజీల రైస్‌తో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం స్టార్ట్ చేసిన.. కుమారీ ఆంటీ ఇప్పుడు రోజుకు 100 కేజీల ఫుడ్ అమ్ముతూ నెలకు 18 లక్షల పై సంపాదిస్తుంది. తక్కువ ధరకే బోట్, చికెన్, మటన్, లివర్ వంటి స్పెషల్ డిషెస్ అమ్ముతూ తన వంటకాలకు ఫుల్ క్రేజ్ దక్కించుకుంది కుమారి ఆంటీ.
ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టా , యూట్యూబ్ ఎక్కడ చూసిన కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ వీడియోలు హల్ చల్ చేస్తుంటాయి. రోజు వందలకు పైగా కష్టమర్స్ ఈమె ఫుడ్ కోసం ఎగబడుతుంటారు. ఇక సోషల్ మీడియాలో (Social Media) సంచలనంగా మారిన కుమారీ ఆంటీ బిజినెస్ కు పోలీసులు షాకిచ్చారు.
కుమారి ఆంటీకి పోలీసుల షాక్
స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ తో నెలకు లక్షలు సంపాదిస్తున్న కుమారీ ఆంటీకి పోలీసులు షాకిచ్చారు. ఈమె వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ కావడంతో ఫుడ్ సెంటర్ వద్ద జనం భారీగా ఎగబడ్డారు. దీంతో రోడ్డుకు అడ్డంగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) ఏర్పడింది. ఫుడ్ సెంటర్ కు పర్మిషన్ లేకపోవడంతో అక్కడి నుంచి తొలగించాలని పోలీసులు ఆదేశించారు. ప్రస్తుతానికి వారం రోజుల పాటు క్లోజ్ చేయాలని చెప్పారు. అయితే పక్కన ఉన్న వ్యాపారులను బిజినెస్ చేసుకోమని.. తన బిజినెస్ కు అభ్యంతరం చెప్పడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ లో బాలీవుడ్ భామల.. బ్యూటీ లుక్స్