Chandrababu : చంద్రబాబు నివాసం వద్ద భారీ భద్రత

AP: ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద భారీగా భద్రత ఏర్పాటు చేశారు పోలీస్ అధికారులు. ఇద్దరు ఎఎస్పీల ఆధ్వర్యంలో భద్రత పర్యవేక్షించనున్నారు. ఈరోజు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు చంద్రబాబును కలవనున్నారు.

New Update
Chandrababu:  సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతా.. చంద్రబాబు వీడియో వైరల్..!

TDP Chief Chandrababu : ఉండవల్లి (Undavalli) లోని టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) నివాసం వద్ద భారీగా భద్రత ఏర్పాటు చేశారు పోలీస్ అధికారులు. ఇద్దరు ఎఎస్పీల ఆధ్వర్యంలో భద్రత పర్యవేక్షించనున్నారు. ఈరోజు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు చంద్రబాబును కలవనున్నారు. నిన్నటి కంటే ఈరోజు చంద్రబాబు నివాసం వద్ద భారీగా భద్రత పెంచారు. 150 నుంచి 200 మంది పోలీసులు తో అధికంగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

12న సీఎంగా ప్రమాణస్వీకారం..

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఇంకాస్త వెనక్కు వెళ్ళింది. ఈ నెల 9 న మోడీ (PM Modi) ప్రమాణ స్వీకారం ఉండటంతో 12 న చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ముందుగానే రెండు తేదీల్లో పండితులు మంచి ముహూర్తాలు చూసారు. అందుకే ప్రమాణ స్వీకాంలో మార్పు చేసుకోవడానికి ఏ ఇబ్బందీ రాలేదని చెప్పారు. అలాగే ప్రమాణస్వీకారం చేసే ప్రాంతం పై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Also Read : బీజేపీలో భారీ మార్పులు..

Advertisment
తాజా కథనాలు