Karimnagar: కరీంనగర్ లో భూకబ్జాలపై పోలీసుల ఉక్కుపాదం.. కార్పోరేటర్, బీఆర్ఎస్ నాయకుడు అరెస్ట్

కరీంనగర్ జిల్లాలో భూ కబ్జాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కొత్తగా వచ్చిన సీపీ అభిషేక్ మహంతి జిల్లా కేంద్రంగా ఫైనాన్షియల్ అఫెన్సెస్, భూ ఆక్రమణలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఓ కార్పోరేటర్, బీఆర్ఎస్ నేతతోపాటు పలువురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

New Update
Karimnagar: కరీంనగర్ లో భూకబ్జాలపై పోలీసుల ఉక్కుపాదం.. కార్పోరేటర్, బీఆర్ఎస్ నాయకుడు అరెస్ట్

Karimnagar: కరీంనగర్ జిల్లాలో భూ భూకబ్జాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కొత్తగా వచ్చిన సీపీ అభిషేక్ (CP MAHANTHI) మహంతి జిల్లా కేంద్రంగా కొనసాగుతున్న ఆక్రమణలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఫైనాన్షియల్ అఫెన్సెస్, భూ ఆక్రమణలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులతో విచారణ వేగవంతం చేసిన అభిషేక్ మహంతి.. నగరంలోని భూ వివాదాల్లో తలదూర్చుతున్న ఓ కార్పోరేటర్ (CORPORATER), బీఆర్ఎస్ (BRS) నేతతోపాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

కేసీఆర్ బంధువునంటూ..
ఈ మేరకు సీతారాంపూర్ 21వ డివిజన్ కార్పోరేటర్ జంగిల్ సాగర్ (SAGAR) అరెస్ట్ చేశారు. అలాగే మరో కార్పోరేటర్ తోటరాముడి (RAMUDU)తో పాటు, బీఆర్ఎస్ నాయకుడు చీటి రామారావు (Cheeti Rama Rao)ను కూడా అరెస్ట్ చేశారు. పోలీసుల జాబితాలో మరింత మంది కార్పోరేటర్స్, నాయకులు ఉన్నట్లు తెలుస్తుండగా.. రేపు మరో ఇద్దరు కార్పోరేటర్స్ అరెస్ట్ కు రంగం సిద్ధం చేసినట్లు మహంతి తెలిపారు. అంతేకాదు కేసీఆర్ బంధువునని బెదిరిస్తూ భూకబ్జాలకు పాల్పడుతున్నారి, దీంతో విచారణ వేగవంతం చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.

ఇంటి నిర్మాణం అడ్డుకుని..
ఇక కరీంనగర్ లోని భగత్ నగర్ కు చెందిన కొత్త రాజిరెడ్డి, తండ్రి భాగిరెడ్డిలు.. మున్సిపల్ పర్మిషన్ తోనే ఇంటి నిర్మాణం చేపట్టారు. అయితే గంగాధరకు చెందిన చీటీ రామారావు, కరీంనగర్ 12వ డివిజన్ కు చెందిన కార్పొరేటర్ తోట రాములు కలిసి ఆ ఇంటి నిర్మాణం అడ్డుకున్నారని రాజిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ ఎస్సై ఎస్.ఐ. స్వామి కేసు చెప్పారు. ఈ ఇద్దరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా రాజిరెడ్డి ఇంటి స్థలాన్ని ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతోనే హద్దులు మార్చి, తప్పుడు దృవపత్రాలు సృష్టించారని విచారణలో తేలిందని ఎస్త్సై స్వామి చెప్పారు.

ఇది కూడా చదవండి : AP : పిచ్చి కూతలతో ఆయన చరిష్మను ఇంచు కూడా కదపలేరు.. పరిటాల సునీత

కబ్జాదారుల అరెస్ట్..
కరీంనగర్ కమీషనరేట్ లో ఇటీవల ఏర్పాటైన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సహాయంతో వన్ టౌన్ పోలీసులు ఈ కేసు విచారణ చేపట్టగా.. పూర్తిస్థాయి విచారణకోసం హైదరాబాద్, విశాఖపట్నానికి సైతం వెళ్లి కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించామని పోలీసు బృందం తెలిపింది. ఇప్పటికి సేకరించిన ఆధారాలతో వీరంతా అక్రమ భూకబ్జాకు పాల్పడ్డారని నిర్ధారించినట్లు కరీంనగర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ జె.సరిలాల్ తెలిపారు. వీరిపై.. Cr. No. 491/2023 u/s 120-B , 447, 427, 465, 467, 468, 471 r/w 34 IPC సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి కరీంనగర్ మెజిస్ట్రేట్ కోర్ట్ లో హాజరు పరిచినట్లు వెల్లడించారు. మేజిస్ట్రేట్ కేసుపూర్వ పరాలు పరశీలించిన తర్వాత నిందితులను జనవరి 31 వరకు రిమాండ్ విధించారు.

అధికార బలంతో బెదిరింపులు..
అధికార బలంతో చీటీ రామారావు, బీఆర్ఎస్ పార్టీ కార్పోరేటర్ తోట రాములు, నిమ్మశెట్టి శ్యాం.. తమను ఇబ్బందులకు గురిచేశారని రాజిరెడ్డి అంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో ప్రజాపాలనకు హాజరై సీఎం రేవంతర్ రెడ్డికి ఫిర్యాదు చేశామని, పోలీసులకు వచ్చిన ఆదేశాలతో విచారణ జరపిన సిట్ బృందం చర్యలు తీసుకుందని చెప్పారు. చీటీ రామారావుపై గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నాయని, కేసీఆర్ కు బంధువునంటూ భూ వివాదాల్లో తలదూర్చి అందినకాడికి దోచుకుంటున్నాడని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు