Hyderabad : కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు తీసుకుంటే భారీ జరిమానా..

మాదాపూర్ కేబుల్‌ బ్రిడ్జిపై సెల్ఫీ తీసుకుంటున్న ఇద్దరిని ఓ కారు ఢీకొనగా.. ఒకరు మృతి చెందడం, మరొకరు గాయాలపాలైన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. కేబుల్ బ్రిడ్జిపై మళ్లీ ఎవరూ సెల్ఫీలు తీసుకోవద్దని.. అలా చేస్తే రూ.1000 ఫైన్ వేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.

New Update
Hyderabad : కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు తీసుకుంటే భారీ జరిమానా..

Hyderabad Cable Bridge : కేబుల్ బ్రిడ్జి(Cable Bridge) పై సెల్ఫీలు(Selfies) తీసుకుంటే భారీ జరిమానా.. ఇటీవల హైదరాబాద్‌(Hyderabad) మాదాపూర్‌(Madhapur) లోని కేబుల్ బ్రిడ్జిపై అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. సెల్ఫీలు దిగుతున్న ఇద్దరిపై నుంచి కారు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటలు ఈ ఘటన జరిగింది. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు అనిల్‌గా, గాయలపాలైన వ్యక్తి అజయ్‌గా గుర్తించారు. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే నిందితుడు పరారయ్యాడు.

Also read: కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. కేసు కొట్టివేసిన కోర్టు

దీంతో రంగంలోకి దిగిన పోలీసుల సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యం సేవించాడా లేదా అనేది తెలుసుకునేందుకు బ్లడ్ శాంపిల్స్‌ను కూడా తీసుకున్నారు. అలాగే కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు దిగేవారికి కూడా పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. కేబుల్ బ్రిడ్జి అనేది కేవలం వాహనాల కోసం మాత్రమేనని.. సెల్ఫీలు దిగేందుకు కాదంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇక నుంచి కేబుల్ బ్రిడ్జిపై ఎవరైనా ఫొటోలు తీస్తే వెయ్యి రూపాయల ఫైన్ వేస్తామని హెచ్చరించారు.

Also read: BRS మళ్లీ TRSగా.. కేసీఆర్‌ సంచలన నిర్ణయం !

Advertisment
తాజా కథనాలు