Telangana: మణికొండ డ్రగ్స్‌ కేసులో పట్టుబడ్డ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు

హైదరాబాద్‌ మణికొండలోని కేవ్‌ పబ్‌లో మొత్తం 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. డీజే నిర్వాహకుడు ఆయూబ్‌తో సహా మరో 24 మంది డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్లు తేలినట్లు గుర్తించారు. డ్రగ్స్ తీసుకున్నవారిలో ఎక్కువమంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొన్నారు.

Telangana: మణికొండ డ్రగ్స్‌ కేసులో పట్టుబడ్డ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు
New Update

హైదరాబాద్‌ మణికొండలోని కేవ్‌ పబ్‌లో టీజీ న్యాబ్ అధికారులు, రాయదుర్గం SOT పోలీసులు నిర్వహించగా.. మొత్తం 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. కేవ్‌ పబ్‌లో దొరికిన వారకి వైద్య పరీక్షలు చేయగా.. డీజే నిర్వాహకుడు ఆయూబ్‌తో సహా మరో 24 మంది డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్లు తేలినట్లు గుర్తించారు. అలాగే మత్తు పదార్థాలు తీసుకున్నవారిలో ఎక్కువమంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొన్నారు.

Also Read: మేడిగడ్డ బ్యారేజీ ఇసుకకు భారీ డిమాండ్.. ప్రభుత్వానికి రూ.500 కోట్ల ఆదాయం !

ఈ సందర్భంగా మాదాపూర్‌ డీసీపీ వినిత్‌ మీడియాతో మాట్లాడారు. ' పబ్‌లో మ్యూజిక్‌ పార్టీ ఏర్పాటు చేశారు. అందులో డ్రగ్స్‌ సేకరించినట్లు గుర్తించాం. 25 మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశాం. బయట నుంచి డ్రగ్స్‌ తీసుకొనే వాళ్లు పబ్‌లోకి వచ్చినట్లు మా విచారణలో తేలింది. సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌ పార్టీ ఏర్పాటు చేశామంటూ ప్రచారాలు చేశారు. సమాచారం మేరకు తెలంగాణ నార్కోటిక్‌, సైబరాబాద్‌, ఎస్వోటీ, రాయదుర్గం పోలీసులు కేవ్‌ పబ్‌లో సోదాలు చేపట్టారు. డ్రగ్స్‌ను ప్రోత్సహించినందుకు ఆ పబ్‌ను సీజ్‌ చేశాము.

ఈ కేసులో కేవ్ పబ్‌ మేనేజర్‌ అయిన శేఖర్‌ను అదుపులోకి తీసుకున్నాం. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నాం. ఐటీ కంపెనీలు.. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు డ్రగ్స్‌ తీసుకోవద్దని అవగాహన కల్పించాలి. మరికొన్ని రోజుల్లో మిగిలిన పబ్‌లలో కూడా సోదాలు చేపడతాం. గతంలో కూడా ఈ కేవ్‌ పబ్‌లో ఇలాంటి పార్టీలు జరిగినట్లు అనుమానాలు ఉన్నాయి. పబ్‌ యజమానులు మరో నలుగురు పరారీలో ఉన్నారు. వాళ్లని కూడా త్వరలోనే అరెస్టు చేసి.. మరింత సమాచారం సేకరిస్తామని డీసీపీ వినిత్ చెప్పారు.

Also read: తెలంగాణలో రాజకీయ సంక్షోభం.. 38 మంది ఎమ్మెల్సీల పదవులు ఫట్?

#drugs-case #telugu-news #telangana-news #cave-pub
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe