Janasena : జనసేనలో మహిళలకు అన్యాయం జరుగుతోంది : పోసపల్లి సరోజా

కాకినాడ రూరల్‌ అసెంబ్లీ టికెట్‌ తనకు ఇవ్వకపోవడంతో.. జనసేన రాష్ట్ర కార్యదర్శి పోసపల్లి సరోజా ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో మహిళలకు గౌరవం లేదని.. కాపులకే పెద్ద పీట వేశారని విమర్శించారు. దీంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Janasena : జనసేనలో మహిళలకు అన్యాయం జరుగుతోంది : పోసపల్లి సరోజా
New Update

Polasapalli Saroja : జనసేన పార్టీ(Janasena Party) ఆదివారం రాత్రి 18 మంది అసెంబ్లీ అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే రెండు పార్లమెంటు స్థానాలకు కూడా అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే కాకినాడ జిల్లా(Kakinada District) లోని కాకినాడ రూరల్ అసెంబ్లీ సీటు తనకు దక్కలేదని ఓ జనసేన వీర మహిళ కంటతడిపెట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే పోసపల్లి సరోజా(Polasapalli Saroja) మహిళ జనసేన రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కాకినాడ రూరల్‌ అసెంబ్లీ టికెట్‌ తనకు ఇవ్వకపోవడంతో ఆమె ఆవేదన చెందారు. తాను శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో.. తనని కాదని కాపు సామాజిక వర్గానికి చెందిన పంతం నానాజీ(Pantham Nanaji)కి పార్టీ టికెట్‌ ఇవ్వడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర కార్యదర్శి పదవికి ఆమె రాజీనామా చేశారు.

Also Read:  కన్నీరు పెట్టుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే

పేరుకే వీర మహిళలు

' జనసేన పార్టీలో మహిళలకు విలువ లేదు. పేరుకే వీర మహిళల ఝాన్సీ లక్ష్మి భాయ్‌(Jhansi Lakshmi Bhai) తో జనసేనలో ఉన్న మహిళలను పోలుస్తారు. పవన్ కల్యాణ్‌ చుట్టు కాపు కోటరీ ఒకటి ఉంది. కనీసం ఆయనతో కూడా మమ్మల్ని కలవనివ్వరు. నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్, చక్రవర్తి వంటి నాయకుల వల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డాం. నాదెండ్ల మనోహర్‌ తెలుగుదేశం పార్టీ కోవర్ట్‌. బీసీలకు జనసేనలో విలువ లేదు. నేను బీసీని కాబట్టి నాకు పార్టీలో విలువ లేదు. బీసీలు ఇప్పటికైనా మేల్కోవాలి. బీసీలకు రాజ్యాధికారం రావాలని' సరోజా అన్నారు.

నాకు అవమానం జరిగింది

'జనసేన ఒక కాపుల పార్టీ. కేబినేట్‌ హోదాలో పనిచేసిన నన్ను కూడా పార్టీ అధినేత పట్టించుకోలేదు. నిబద్ధతో పనిచేసిన వారికి పార్టీలో గౌరవం ఉండదు. కొత్తగా వచ్చినవారికి టికెట్లు, వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారు. పార్టీ అధినేత.. ఒక కాపుగా బీసీలకు, మహిళలకు, యువతకు పెద్దపీట వేస్తామన్నారు. కాకినాడ రూరల్‌లో ఒక సన్నాని, దద్దమ్మకు పార్టీ టికెట్ ఇచ్చారు. పోల్‌ మేనేజ్‌మెంట్, బూత్‌ మేనేజ్‌మెంట్ లేకపోవడం పార్టీ నాయకులదే వైఫల్యం. పవన్‌ కల్యాణ్ కోసం దశాబ్ద కాలంగా యువత భవిష్యత్తు, వాళ్లు కన్న కలలు ఆవిరయ్యాయి. యువత రోడ్డున పడ్డారు. పార్టీలో కాపు కులానికే పెద్దపీట వేశారు. మహిళలకు అన్యాయం జరిగింది.
నాకు ఈ ఎన్నికల్లో సీటు ఇస్తారని చెప్పి పార్టీలో ఘోరంగా అవమానపరిచారు. అందుకే రాజీనామా చేస్తున్నా. కాకినాడ రూరల్‌లో పంతం నానాజీని, వివిధ నియోజకవర్గాల్లో ఉన్న జనసేన అభ్యర్థులను ఓడించడే నా ప్రధాన కర్తవ్యమని' పోసపల్లి సరోజా పేర్కొన్నారు.

Also Read : అందరిని గుర్తుపెట్టుకుంటాం.. వైసీపీ నేతలకు లోకేష్ హెచ్చరికలు

ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) లో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల రంగంలోకి దిగాయి. మే 13న అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. జూన్‌ 1 న పార్లమెంటు ఎన్నికలతో సహా.. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు రానున్నాయి. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆసక్తి నెలకొంది. ఈసారి మరి ఆంధ్రా ప్రజలు ఏ పార్టీకి అధికారం అప్పగిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

#telugu-news #janasena #ap-assembly-elections-2024 #polasapalli-saroja
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe