భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదన్న ప్రధాని మాటల్లో నిజం లేదు... !

ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్ లోని ఒక అంగుళం భూమిని కూడా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ఆక్రమించలేదని ప్రధాని మోడీ అన్నారని చెప్పారు. కానీ ఆ మాటల్లో నిజం లేదన్నారు. మన దేశంలోని చైనా సైనికులు ప్రవేశించారని స్థానికులు సైతం చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.

author-image
By G Ramu
New Update
National: బీజేపీ భయం పోయింది..ఉప ఎన్నికల్లో విజయభేరిపై రాహుల్ కామెంట్

ప్రధాని మోడీ(pm modi)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్ లోని ఒక అంగుళం భూమిని కూడా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(;PLa) ఆక్రమించలేదని ప్రధాని మోడీ అన్నారని చెప్పారు. కానీ ఆ మాటల్లో నిజం లేదన్నారు. మన దేశంలోని చైనా సైనికులు ప్రవేశించారని స్థానికులు సైతం చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. తన తండ్రి, దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా ఆయనకు రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. తాము పశువుల మేత కోసం ఉపయోగించి భూభాగాన్ని చైనా ఆక్రమిస్తోందని చెబుతున్నారన్నారు.

కానీ ప్రధాని మోడీ మాత్రం దేశం ఒక్క అంగుళం భూమిని కోల్పోలేదని చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. ఆ వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. ఇక్కడి వాళ్లను ఎవరిని అడిగినా ఆ విషయం చెబుతారన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్ ప్రాంతాన్ని రెండుగా విభజించి లడఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడంపై కూడా ఆయన ప్రశ్నలు సంధించారు.

లడఖ్ ప్రజలు చాలా ప్రశ్నలు అడుగుతున్నారని అన్నారు. లడఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడంపై ఇక్కడి ప్రజలు సంతోషంగా లేరన్నారు. వాళ్లు తమకు మరింత ప్రాతినిధ్యం కావాలంటున్నారని చెప్పారు. కేంద్ర పాలిత ప్రాంతంలో నిరుద్యోగం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ ప్రాంతాన్ని అధికారులు కాకుండా ప్రజా ప్రతినిధులు నడిపించాలని వాళ్లు కోరుతున్నారని వెల్లడించారు.

తన తండ్రితో ఆయన జరిపిన సంభాషణను ఈ సందర్బంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ‘నాకు గుర్తుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు, మా నాన్న ఒకసారి పాంగోంగ్ త్సో వెళ్లి వచ్చారు. అప్పుడు సరస్సుకు సంబంధించిన కొన్ని చిత్రాలను నాకు చూపించారు. అది భూమిపై అత్యంత అందమైన ప్రదేశం అని ఆయన నాకు చెప్పారు. 'భారత్ జోడో యాత్ర' సమయంలో, నేను లడఖ్ కు రావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను.అప్పుడు లడఖ్ ను సందర్శించి, ఇక్కడ ఎక్కువసేపు ఉండవచ్చని అనుకున్నాను. నేను నుబ్రా వ్యాలీ మరియు కార్గిల్‌ను కూడా సందర్శిస్తాను’అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు