Sharad Pawar: మతాల పరంగా బడ్జెట్ కేటాయింపులు.. మోదీపై శరద్ పవార్ ఫైర్

ముస్లింలకు బడ్జెట్‌లో 15 శాతం కేటాయించాలని కాంగ్రెస్ కోరుకుంటోందన్న ప్రధాని మోదీ వాదన మూర్ఖత్వం అని శరద్ పవార్ అన్నారు. కులం, మతం ఆధారంగా కేటాయింపులు ఎప్పటికీ జరగవని తేల్చి చెప్పారు. మోదీ చెప్పేవన్నీ అబద్దాలే అని ఫైర్ అయ్యారు.

New Update
Sharad Pawar: మతాల పరంగా బడ్జెట్ కేటాయింపులు.. మోదీపై శరద్ పవార్ ఫైర్

NCP chief Sharad Pawar: మోదీ, బీజేపీ పార్టీపై విమర్శల దాడికి దిగారు ఎన్‌సిపి అధినేత శరద్ పవార్. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మోదీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ముస్లింలకు బడ్జెట్‌లో 15 శాతం కేటాయించాలని కాంగ్రెస్ కోరుకుంటోందన్న ప్రధాని నరేంద్ర మోదీ వాదన మూర్ఖత్వం అని అన్నారు. కులం, మతం ఆధారంగా కేటాయింపులు ఎప్పటికీ జరగవని తేల్చి చెప్పారు.

ALSO READ: సీఎం కేజ్రీవాల్ కు ఈడీ బిగ్ షాక్

ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. "కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఏ కులం లేదా మతానికి సంబంధించినది కాదని అన్నారు. కాంగ్రెస్ గత హయాంలో ముస్లింలకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో 15 శాతం కేటాయించాలని కోరిందని, మతం ప్రాతిపదికన ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు లేదా రిజర్వేషన్లను విభజించడాన్ని అనుమతించబోమని ప్రధాని మోదీ బుధవారం ఆరోపించారు.

దీనిపై శరద్ పవార్ మాట్లాడుతూ.. మోదీ చేసే వ్యాఖ్యలు "అవివేకం" అని అన్నారు. కులం, మతాల ప్రాతిపదికన బడ్జెట్‌ కేటాయింపులు ఎప్పటికీ జరగవని అన్నారు. ప్రధాని మోదీ ‘ఓటు జిహాద్’ వ్యాఖ్య గురించి అడిగిన ప్రశ్నకు పవార్, “ఈ రోజుల్లో మోదీ మాట్లాడుతున్న దాంట్లో ఒక్క శాతం కూడా నిజం లేదు. అతను విశ్వాసం కోల్పోయాడు. ” అని అన్నారు. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ రంగంలో అభివృద్ధిపై ఆసక్తి ఉండేవారని, ఇప్పుడు రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని పవార్ అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కానీ ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారో చెప్పలేను అని ఆయన పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు