PM Suraj Portal : వ్యాపారస్తులకు మోదీ గిఫ్ట్‌.. రూ.15 లక్షల రుణాన్ని ఎలా పొందవచ్చు?

పీఎం సూరజ్ పోర్టల్‌లో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఈ పోర్టల్ ద్వారా అణగారిన వర్గాలకు కేంద్రం రుణ సహాయం అందిస్తుంది. ఈ పోర్టల్ ద్వారా రూ. 15 లక్షల వరకు వ్యాపార రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేదు.

PM Suraj Portal : వ్యాపారస్తులకు మోదీ గిఫ్ట్‌.. రూ.15 లక్షల రుణాన్ని ఎలా పొందవచ్చు?
New Update

PM-SURAJ National Portal : కేంద్ర ప్రభుత్వం(Central Government) అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇందులో రేషన్, హౌసింగ్, పెన్షన్, బీమాకు చెందిన అనేక పథకాలు ఉన్నాయి. ఇక ఎప్పటికప్పుడు కొత్త పథకాలను కూడా ప్రారంభిస్తుంటారు. అణగారిన వర్గాలకు రుణ సహాయం కోసం మోదీ మరో అడుగు ముందుకు వేశారు. తాజాగా PM సూరజ్ పోర్టల్‌ను ప్రారంభించారు. అంతేకాకుండా లక్ష మందికి రుణం కూడా అందించారు. అసలేంటి సూరజ్‌ పోర్టల్? ఈ పోర్టల్‌ ప్రయోజనాలేంటి?

ఏంటి పోర్టల్?

PM సూరజ్ పోర్టల్(PM Suraj Portal) ఒక జాతీయ పోర్టల్. ఇది సామాజిక అభ్యున్నతి, ఉపాధి, ప్రజా సంక్షేమంపై నడిచే పోర్టల్. దీని ద్వారా రుణ సాయాన్ని ఆమోదిస్తారు. అర్హులైన వారికి రుణాలు తీసుకునే సౌలభ్యం కలిగించే పోర్టల్‌ ఇది. ప్రజలు సులభంగా రుణం తీసుకోగలుగుతారు.రూ. 15 లక్షల వరకు వ్యాపార రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైనా బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేదు. ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది.

--> సమాజంలోని అత్యంత అణగారిన వర్గాల కోసమే కేంద్రం ఈ పోర్టల్‌ను తీసుకొచ్చింది. వారికి సాధికారత కల్పించడమే దీని లక్ష్యం. అదే సమయంలో ఈ పథకం కింద రుణాలు అందిస్తారు.

--> PM సూరజ్ పోర్టల్ ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు కూడా సృష్టిస్తోంది కేంద్రం. ఈ పోర్టల్ వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయోజనం పొందుతారు.

ఎవరు ప్రయోజనం పొందవచ్చు?

ప్రధానమంత్రి కార్యాలయం ప్రకారం, అణగారిన వర్గాలు ఈ PM సూరజ్ పోర్టల్ ద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. పథకానికి చెందిన నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మిగిలిన సమాచారం అందుబాటులో ఉంటుంది. PM సూరజ్ పోర్టల్ ద్వారా బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు(Non-Banking Financial Companies), మైక్రో ఫైనాన్స్ సంస్థలు(Micro Finance Companies), ఇతర సంస్థల ద్వారా అర్హులైన వ్యక్తులకు రుణాలు ఇస్తారు.

Also Read : రద్దీగా ఉన్న మార్కెట్లోకి దూసుకొచ్చిన కారు.. మహిళ మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు!

#business-loan #pm-suraj-national-portal #loans
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe