PM Narendra Modi: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ప్రధాని నరేంద్ర(PM Modi) తీవ్రంగా స్పందించారు. తిన్న అవినీతి సొమ్మును కక్కిస్తామని, ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. మంగళవారం నాడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా బీజేపీ నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ.. కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) టార్గెట్‌గా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లీడర్లలో అహంకారం కనిపిస్తోందని ఫైర్ అయ్యారు. ప్రతి ఒక్కరు మోడీని తిడుతున్నారని సీరియస్ అయ్యారు. కుటుంబాల కోసం పనిచేసే పార్టీలు మోడీని తిట్టడమే పనిగా పెట్టుకున్నాయని దుయ్యబట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ(Telangana)ను దోచుకున్నాయని విమర్శించారు. ప్రజల సొమ్ము తిన్న అవినీతి పరులను ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. తప్పు చేసిన వారందరినీ జైల్లో వేస్తామని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అవినీతి కేరాఫ్ అయిన కాంగ్రెస్ కూడా బీజేపీపై ఆరోపణలు చేస్తుందని విమర్శించారు. ఐదు తరాల భవిష్యత్‌ను కాంగ్రెస్ నాశనం చేస్తే.. రెండు తరాల భవిష్యత్‌ను బీఆర్ఎస్ నాశనం చేసిందంటూ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై ప్రధాని మోదీ సీరియస్‌గా స్పందించారు. అవినీతికి పాల్పడ్డ ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనను చూశారని, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని అన్నారు ప్రధాని మోదీ.
బీసీ ముఖ్యమంత్రిపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్బీ స్టేడియం వేదికగా బీజేపీ నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆకాంక్షలను ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదంటూ బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. 9 ఏళ్లుగా తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక ప్రభుత్వం ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి తన కుటుంబమే ముఖ్యం అని, కాంగ్రెస్, బీఆర్ఎస్ లో కామన్‌గా 3 డీఎన్ఏలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి C - టీమ్ బీఆర్ఎస్ అని అన్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత కల్పించిన బీజేపీ..
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు బీజేపీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అబ్దుల్ కలాం ను రాష్ట్రపతి చేసింది బీజేపీనే అన్నారు. లోక్‌సభ తొలి దళిత స్పీకర్‌గా బాలయోగిని, గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసింది కూడా బీజేపీనే అని పేర్కొన్నారు ప్రధాని మోదీ. బీసీ వ్యక్తినైనా తనను ప్రధానిని చేసింది కూడా బీజేపీనే అని అన్నారు. తెలంగాణలో మార్పు తుపాను కనిపిస్తోందని, ఇప్పుడు ఇక్కడ నుంచే తెలంగాణకు బీసీ సీఎం రాబోతున్నారని అన్నారు. ఈ నేలతో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్న ప్రధాని మోదీ.. మోదీని ప్రధానిని చేసే ఘట్టానికి పునాది పడింది ఇక్కడి నుంచే అని గుర్తు చేశారు. ఇదే గ్రౌండ్‌లో ప్రజలు తనను ఆశీర్వదించడంతోనే తాను ప్రధానిని అయ్యానని అన్నారు. బీసీ ఆత్మగౌరవ సభలో భాగం కావడం తన అదృష్టంగా పేర్కొన్నారు ప్రధాని మోదీ.
విడిచిపెట్టేది లేదు..
లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ నేతలను విడిచిపెట్టామని కాంగ్రెస్ తమపై ఆరోపణలు చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. అవినీతి సొమ్ము తిన్న ఏ ఒక్కరినీ విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అవినీతి చేసిన వారిని కచ్చితంగా జైలులో వేస్తామని స్పష్టం చేశారు.
Also Read:
కొడంగల్‌లో రేవంత్ వర్సెస్ పట్నం నరేందర్ రెడ్డి.. ఎవరి బలం ఏంటో తెలుసా?