PM Modi - KCR: కేసీఆర్‌కు గాయం.. స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాదానికి గురికావడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కేసీఆర్‌కు గాయమైందన్న వార్త తనను బాధించిందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ. ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు.

New Update
PM Modi - KCR: కేసీఆర్‌కు గాయం.. స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..!

PM Modi wishes KCR speedy recovery: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గాయం అవడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని అభిలషించారు. 'తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.' అంటూ ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తరువాత.. సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే, గురువారం రాత్రి ఆయన నడుస్తుండగా.. కాళ్లకు పంచ అడ్డు తగలడంతో కింద పడిపోయారు. దాంతో ఆయన తుంటి ఎముక విరిగిపోయింది. వెంటనే కేసీఆర్‌ను హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద హాస్పత్రికి తరలించారు. ఎక్స్‌రే తీయగా.. ఎడమ కాలు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎమ్మెల్సీ కె. కవిత అప్‌డేట్ ఇచ్చారు. ఎక్స్ వేదికగా.. వివరాలను వెల్లడించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు. చిన్న గాయం అయ్యిందని, ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ప్రజల ఆశీస్సులు, అదరాభిమానాలతో కేసీఆర్ త్వరగా కోలుకుంటారని అన్నారు. ప్రజాభిమానానికి ధన్యవాదాలు తెలిపారు కవిత.

Also Read:

ఉదయాన్నే ఈ 4 పనులు చేస్తే గుండె ఆరోగ్యం, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది..

మహిళలకు గుడ్ న్యూస్.. ఈ నెల 9 నుంచే ఉచిత బస్సు ప్రయాణం

Advertisment
తాజా కథనాలు