Vande Bharat : మోదీ 3.0 తొలి కానుక...ఆ రోజునే తొలి వందేభారత్ స్లీపర్ ట్రైన్‌!

ప్రయాణికులకు ఛైర్‌కార్‌ సర్వీసులను అందిస్తోన్న వందేభారత్.. త్వరలోనే స్లీపర్ రైలు అందుబాటులోకి రానుంది. తొలిసారిగా వందే భారత్‌ స్లీపర్‌ రైలును పట్టాలెక్కించేందుకు కేంద్రం సన్నాహాలు మొదలు పెట్టింది.ఆగస్టు 15 నాటికి వందేభారత్ స్లీపర్ రైలును ప్రారంభించే అవకాశం ఉందని రైల్వే వర్గాలు వెల్లడించాయి.

New Update
Vande Bharat: వందే భారత్ రైలు రూఫ్‌ నుంచి కారిన నీరు

PM Modi : మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్‌ రైళ్లు (Vande Bharat Trains) ఇప్పుడు దేశంలోని పలు ప్రధాన నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం ప్రయాణికులకు ఛైర్‌కార్‌ సర్వీసులను అందిస్తోన్న వందేభారత్.. త్వరలోనే స్లీపర్ రైలు అందుబాటులోకి రానుంది. తొలిసారిగా వందే భారత్‌ స్లీపర్‌ రైలును పట్టాలెక్కించేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. మరో రెండు నెలల్లోపే అంటే ఆగస్టు 15 నాటికి వందేభారత్ స్లీపర్ రైలును ప్రారంభించే అవకాశం ఉందని రైల్వే వర్గాలు వెల్లడించాయి.

వందేభారత్ స్లీపర్ రైలు పనులను పర్యవేక్షణకు ఇటీవల బెంగళూరు (Bangalore) వెళ్లిన కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav)..ఈ రైలు తయారీ చివరిదశలో ఉందని వివరించారు. దేశంలోనే మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్ రైలు ఢిల్లీ, ముంబయి మార్గంలో నడపాలని అధికారులు యోచిస్తున్నారు.

నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో స్లీపర్ రైలు (Sleeper Train) అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి.ఈ రైలు ఢిల్లీ నుంచి భోపాల్‌, సూరత్‌ మీదుగా ముంబయికి ప్రయాణిస్తుందని తెలిపాయి.

Also read: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. గదుల పై టీటీడీ కీలక నిర్ణయం!

Advertisment
Advertisment
తాజా కథనాలు