‘ఇండియా’ అని కాదు.... ఆ పేరుతో పిలవండి.... విపక్ష కూటమికి కొత్త పేరు చెప్పిన మోడీ....!

విపక్షాల కూటమిపై ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్షాల కూటమిని ‘ఇండియా’అని కాకుండా ‘గమాండియా(అహంకారం)’అని పిలవాలన్నారు. విపక్ష కూటమి ‘ఇండియా’గా పేరు మార్చుకున్నది వాళ్ల దేశ భక్తిని చూపించుకోవడానికి కాదన్నారు. కేవలం దేశాన్ని దోచుకోవాలనే ఉద్దేశంతోనే విపక్షాలు తమ కూటమి పేరును మార్చుకున్నాయని ఫైర్ అయ్యారు.

New Update
‘ఇండియా’ అని కాదు.... ఆ పేరుతో పిలవండి.... విపక్ష కూటమికి కొత్త పేరు చెప్పిన మోడీ....!

PM Modis New Name For Opposition Alliance: విపక్షాల కూటమిపై ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్షాల కూటమిని ‘ఇండియా’అని కాకుండా ‘గమాండియా(అహంకారం)’అని పిలవాలన్నారు. విపక్ష కూటమి ‘ఇండియా’గా పేరు మార్చుకున్నది వాళ్ల దేశ భక్తిని చూపించుకోవడానికి కాదన్నారు. కేవలం దేశాన్ని దోచుకోవాలనే ఉద్దేశంతోనే విపక్షాలు తమ కూటమి పేరును మార్చుకున్నాయని ఫైర్ అయ్యారు.

పేదలకు వ్యతిరేకంగా వారు ఎలా కుట్రలు చేశారో అనే విషయాన్ని దాచడానికే ఇప్పుడు విపక్షాలు తమ పేరును యూపీఏ నుంచి ఇండియాగా మార్చుకున్నాయన్నారు. అంతకు ముందు పలు సందర్బాల్లో కూడా ఇండియా కూటమిపై మోడీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో వైట్ వాష్ కావడంతో ఆ రికార్డుల నుంచి బయటపడేందుకు విపక్షాలు యూపీఏను(UPA) రీబ్రాండ్ చేసుకున్నాయన్నారు.

ఇక ఇండియా పేరు పెట్టుకున్నంత మాత్రాన దేశ భక్తులు కాలేరని విపక్ష కూటమిపై ఇటీవల ప్రధాని మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈస్టిండియా కంపెనీ పేరులోనూ ఇండియా వుందన్నారు. అదే విధంగా ఉగ్రసంస్థలు ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ ‘ఇండియన్ ముజాహిద్దిన్’ల పేర్లలోనూ ఇండియా పేరు వుందని ప్రధాని ఎద్దేవా చేశారు.

ఈ జిమ్మిక్కులన్నీ ఎన్నికల్లో పని చేయవన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఎవరు పని చేస్తున్నారనే విషయం ఈ దేశ ప్రజలకు తెలుసన్నారు. విపక్షాలకు ఓ దశ-దిశ లేదని దుయ్యాబట్టారు. ఇక ఎప్పటికీ ప్రతిపక్షంలోనే కూర్చోవాలని విపక్షాలు అనుకుంటున్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. మరో వైపు విపక్ష కూటమికి ఇండియా పేరు పెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ కూడా దాఖలైంది.

Also Read: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు