పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..! By G Ramu 04 Aug 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి Big Relief to Rahul Gandhi in Supreme Court in Modi Surname Case: ‘మోడీ ఇంటి పేరు’ కేసులో దాఖలైన పరువునష్టం కేసులో సుప్రీం కోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. రాహుల్ గాంధీ కేసులో పరిణామాలు విస్తృతంగా వున్నాయని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. ఈ కేసులో తీర్పు రాహుల్ గాంధీని ఎన్నకున్న ఓటర్ల హక్కును కూడా ప్రభావితం చేస్తుందన్నారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్దరించే అవకాశం ఉంది. అంతకు ముందు సుప్రీం కోర్టులో రాహుల్ గాంధీ తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఎవరి పేరును ప్రస్తావించలేదని సింఘ్వీ వాదించారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు 13 కేసులను ఉదహరించిందన్నారు. అందులో నేర నిర్దారణ జరగలేదన్నారు. బీజేపీ కార్యకర్తలు దాఖలు చేసిన కేసుల్లో నేరపూరిత పూర్వాపరాలు, శిక్షలు లేవన్నారు. మరోవైపు పిటిషనర్ పూర్ణే శ్ మోడీ తరఫున ప్రముఖ సీనియర్ లాయర్ మహేశ్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు. రాహుల్ గాంధీ ప్రసంగం 50 నిమిషాల పాటు సాగిందన్నారు. ఈ కేసుకు సంబంధించి అందులో చాలా ఆధారాలు వున్నాయన్నారు. రాహుల్ గాంధీ ఒక సామాజికి వర్గం మొత్తాన్ని అవమానించారన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో రాహుల్ గాంధీకి గరిష్టంగా శిక్షను ఎందుకు విధించారో తెలుసుకోవాలనుకుంటామని చెప్పింది. ఒక వేళ ఈ కేసులో 1 సంవత్సం 11 నెలల శిక్ష విధించి వుంటే రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం రద్దు అయి వుండేది కాదన్నారు. అనంతరం ఈ కేసులో ఆయనకు ఉపశమనం కలిగిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. 2019లో కర్ణాటకలో ఓ బహిరంగ సభలో రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దొంగలందరి ఇంటి పేరు మోడీ ఎలా అవుతోందనని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీపై గుజరాత్ కు చెందిన పూర్ణేశ్ మోడీ గుజరాత్‌లోని సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తీర్పునిచ్చింది. ఈ కేసులో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం ఆ తీర్పును గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీ సవాల్ చేశారు. కానీ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. Also Read: మణిపూర్‌లో సామూహిక ఖననంపై హైకోర్టు స్టే #supreme-court-stays-rahul-gandhis-conviction-in-modi #supreme-court-in-modi-surname-case #big-relief-to-rahul-gandhi-in-supreme-court-in-modi-surname-case #big-relief #modi-surname-case #supreme-court #sc-stays-rahul-gandhis-conviction-in-modi-surname #rahul-gandhi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి