ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎంపీ సంజయ్ సింగ్ లకు షాక్....!

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ లకు షాక్ తగిలింది. ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికేట్ల కేసులో దాఖలైన పరువు నష్టం కేసులో వారిపై చర్యలు తీసుకోకుండా తాత్కాలికంగా స్టే ఇచ్చేందుకు గుజరాత్ హై కోర్టు నిరాకరించింది. ఈ కేసులో స్టే ఇవ్వాలన్న అరవింద్ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది జస్టిస్ సమీర్ దవే అభ్యర్థనను న్యాయమూర్తి జస్టిస్ సమీర్ దవే తిరస్కరించారు.

author-image
By G Ramu
Kejriwal: 'అవినీతికి వ్యతిరేకంగా భారతదేశం' అన్న వ్యక్తే అవినీతి కేసులో అరెస్ట్‌ !
New Update

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ లకు షాక్ తగిలింది. ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికేట్ల కేసులో దాఖలైన పరువు నష్టం కేసులో వారిపై చర్యలు తీసుకోకుండా తాత్కాలికంగా స్టే ఇచ్చేందుకు గుజరాత్ హై కోర్టు నిరాకరించింది. ఈ కేసులో స్టే ఇవ్వాలన్న అరవింద్ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది జస్టిస్ సమీర్ దవే అభ్యర్థనను న్యాయమూర్తి జస్టిస్ సమీర్ దవే తిరస్కరించారు.

కేజ్రీవాల్ కు శుక్రవారం సమన్లు పంపిన నేపథ్యంలో దిగువ న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జరగనుంది. ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు మెట్రోపాలిటన్ కోర్టు ఎదుట హాజరవుతామని కేజ్రీవాల్, సంజయ్ సింగ్ హామీ ఇచ్చారని హైకోర్టు తెలిపింది. కానీ హామీ ఇచ్చినట్టుగా విచారణకు హాజరు కాలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అందువల్ల ఈ కేసులో స్టే ఇవ్వలేమని పేర్కొంది.

ప్రధాని మోడీ విద్యార్హతలతకు సంబంధించిన వివరాలను సీఎం కేజ్రీవాల్ కు ఇవ్వాలని 2016లో కేంద్ర సమాచార కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు గుజరావ్ వర్శిటీ, ఢిల్లీ యూనివర్సిటీలోని పీఐఓలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ ఆదేశాలన సవాల్ చేస్తూ గుజరాత్ యూనివర్సిటీ కోర్టుకు వెళ్లింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం కేంద్ర సమాచార కమిషన్ ఆదేశాలను కొట్టి వేసింది.

ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికెట్ల వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రూ. 25 వేల జరిమానాను కోర్టు విధించింది. ఆ తర్వాత సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరక్షరాస్యుడైన ప్రధాని లేదా తక్కువ చదువుకున్న వ్యక్తి ఈ దేశానికి ప్రధానిగా వుండటం చాలా ప్రమాదకరమని తీవ్ర విమర్శలు గుప్పించారు.

#defamation-case #modi-degree-certificates #mp-sanjay-singh #pm-modi #arvind-kejriwal
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe