PM Modi: ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. పారదర్శక కమ్యూనికేషన్‌కు పిలుపు

ప్రధాని మోదీ తమ పార్టీ మంత్రులు, ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయడంలో యాక్టీవ్‌గా ఉండాలని చెప్పారు.

New Update
PM Modi: ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. పారదర్శక కమ్యూనికేషన్‌కు పిలుపు

ప్రభుత్వ పాలనలో కమ్యూనికేషన్‌ ప్రాముఖ్యతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోకస్ పెట్టారు. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొందడానికి దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవలే ప్రధాని మోదీ తమ పార్టీ మంత్రులు, ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయడంలో యాక్టీవ్‌గా ఉండాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలకు కౌంటర్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించిన ఆయన ఈ సూచనలు చేశారు.

రాజకీయాల్లో ఒక అంశాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక అంశం ప్రజల అభిప్రాయంపై ప్రభావం చూపిస్తుంది. చూసే దృష్టికోణాన్ని మారుస్తుంది. చివరికి దీనివల్ల ఎన్నికల ఫలితాలు కూడా తారుమారు అవుతాయి. విపక్ష పార్టీలు తరచుగా.. ప్రభుత్వ విధానాలను సవాలు చేస్తుంటాయి. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే కొత్త కోణాన్ని తీసుకొస్తుంటాయి. మోదీ ప్రభుత్వానికి ఇలాంటి విషయంలో ప్రజలకు కచ్చితమైన సమాచారం చేరుతుందని నిర్దారించుకోవడం కేవలం తమ రికార్డులను కాపాడుకోవడం మాత్రమే కాదు. ప్రజల్లో నమ్మకాన్ని, విశ్వసనీయతను కాపాడుకోవడం కూడా. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో.. విపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీపై వ్యతిరేక ప్రచారాలు చేసింది. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు ఓటు వేసే వారిలో భయాన్ని, సందేహాన్ని సృష్టించడానికే. అయినప్పటికీ బీజేపీ ఈ ఆరోపణలను బలంగా ఖండించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ప్రధాని మోదీ కూడా ఖండించారు. తమకు రాజ్యాంగంలో మార్పులు చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని కూడా ఆయన పార్టీ సభ్యులకు సూచనలు చేశారు.

Also Read: హర్యానా ఎన్నికలు.. 20 సీట్లు ఇవ్వాలని ఆప్‌ డిమాండ్‌

బీజేపీ ప్రభుత్వం సమాజంలో విభేదాలు సృష్టిస్తోందని..ముఖ్యంగా ముస్లింలను టార్గెట్ చేస్తోందంటూ విపక్ష పార్టీలు ఇలాంటి ఆరోపణలు కూడా చేశాయి. బీజేపీ వల్ల ముస్లింల సంక్షేమానికి ముప్పు ఉంటుందనేలా చిత్రీకరించి మైనార్టీ ఓట్లు పడకుండా చేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేశాయి. అయినప్పటికీ కూడా బీజేపీ ఈ విషయంలో విపక్షాలకు కౌంటర్ ఇచ్చింది. సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్ అనే నినాదంతో సమష్టి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామనే నిబద్ధతను చూపించింది. ప్రభుత్వ పథకాలు అనేవి మతం, కమ్యూనిటీ అనే బేధాలు లేకుండా ప్రజలందరి ప్రయోజనాల కోసం రూపొందించామని ప్రధాని మోదీ కూడా పదేపదే చెప్పారు. మరోవైపు విపక్షాలు భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందనే ఆరోపణలు కూడా చేశాయి. అయినప్పటికీ మోదీ సర్కార్‌.. ఎలాంటి ఆక్రమణ జరగలేదని విపక్ష ఆరోపణలను తిప్పికొట్టింది. అలాగే భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.

Also Read: నకిలీ స్కూళ్లే టార్గెట్.. 27 పాఠశాలలపై సీబీఎస్‌ఈ ఆకస్మిక తనిఖీలు

ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ప్రధాని మోదీ.. మంత్రులకు ఉన్నతాధికారులకు కమ్యూనికేషన్‌ ప్రాధన్యత గురించి వివరించారు. ప్రభుత్వం చర్యలు, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషి చేయాలని కోరారు. ఇది కేవలం విపక్షాలు చేసే అసత్యాలను కౌంటర్ చేయడానికి మాత్రమే కాదు.. ప్రభుత్వంలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి కూడా. ఈ నేపథ్యంలోనే మోదీ ప్రభుత్వం తాము చేసే పనులు, విధానాలను ఎక్కువమందికి చేరవేసే చర్యలను మరింత మెరుగుపర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. తప్పుడు సమాచారం తొందరగా వ్యాప్తి చెందుతున్న ఈ కాలంలో ప్రభుత్వానికి సంబంధించిన విధానాలు, సాధించిన విజయాలు ప్రజలకు సరైన సమయంలో చేరడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలోనే ఇలాంటి యాక్టివ్‌ కమ్యూనికేషన్‌ విధానాన్ని వ్యూహాత్మకంగా అమలు చేయడం ముఖ్యమని ప్రధాని మోదీ భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు