PM Modi: కేరళకు అండగా ఉంటాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ప్రధాని మోదీ శనివారం కేరళలో పర్యటించారు. కొండచరియలు విరిగిన ప్రాంతాలను పరిశీలించి.. బాధితులను పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం కేరళకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

PM Modi: కేరళకు అండగా ఉంటాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
New Update

భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి కేరళలోని వయనాడ్ జిల్లాలో పెను విషాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం కేరళలో పర్యటించారు. కొండచరియలు విరిగిన ప్రాంతాలను పరిశీలించి.. బాధితులను పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం కేరళకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Also Read: దీనికి బాధ్యులు ఎవరో చెప్పండి.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన కేటీఆర్!

వయనాడ్‌లో పర్యటించిన తర్వాత ప్రధాని మోదీ అక్కడి పిరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేరళకు అండగా ఉంటామన్నారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన రోజున సీఎం విజయన్‌తో మాట్లాడానని.. ప్రకృతి విపత్తులో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఇది సాధారణమైన విపత్తు కాదని.. వేలాది కుటుంబాల్లో విషాదం నింపిందని పేర్కొన్నారు.

Also Read: హిండెన్‌బర్గ్‌ నుంచి సంచలన ట్వీట్‌.. అదాని తర్వాత నెక్స్ట్‌ టార్గెట్‌ ఎవరు ?

అక్కడి పరిస్థితులను చూసి బాధితులను కలిశానని.. మృతులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అలాగే ప్రస్తుతం అక్కడి పరిస్థితిని మెరుగుపర్చేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. విపత్తులో ఇప్పటివరకు 300 మంది ప్రాణాలు కోల్పోయారు.

#wayanad-floods #telugu #kerala
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe