Modi-Revanth : మొదటిసారి ఒకే వేదికపై మోదీ-రేవంత్.. ఎప్పుడంటే?

తెలంగాణలో మోదీ ఎన్నికల శంఖారావన్ని పూరించనున్నారు. మార్చి 4న తెలంగాణకు మోదీ రానున్నారు. 2 రోజుల పాటు రాష్ట్రంలో ప్రధాని టూర్ కొనసాగుతుంది. 4న సంగారెడ్డి, 5న ఆదిలాబాద్‌లో మోదీ పర్యటిస్తారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతం పలకనున్నారు.

New Update
Modi-Revanth : మొదటిసారి ఒకే వేదికపై మోదీ-రేవంత్.. ఎప్పుడంటే?

PM Modi Tour In Telangana : ఇద్దరికి ఇద్దరే.. రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్‌, సపరేట్ ఇమేజ్ సంపాదించుకున్న నేతలు వారు. ప్రధాని మోదీ(PM Modi), తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి(Telangana CM Revanth Reddy) కి ఉండే ఫ్యాన్‌ బ్యాస్‌ సినీ హీరోలకు మించి ఉంటుంది. ఈ ఇద్దరిలో ఎవరు సభ పెట్టినా అభిమానులు ఇట్టే వాలిపోతారు. అలాంటి క్రేజ్ ఉన్న నేతలు ఒకే ప్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఇద్దరు ఒకే వేదికపై మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? పిక్చర్‌ పర్ఫెక్ట్ కదు..! ఇలా ఇద్దరు ఎందుకు కలుస్తారని ఆలోచిస్తున్నారు.. నిజంగానే కలవబోతున్నారు. అది కూడా మన తెలంగాణలోనే. అది కూడా మరికొన్ని రోజుల్లోనే.. అవును..! ప్రధాని తెలంగాణ పర్యటన ఖరారైంది.

షా ప్రోగ్రాం క్యాన్సిల్:
రానున్న లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) కోసం తెలంగాణలో గతం కంటే ఎక్కువ స్థానాలు గెలవాలని భావిస్తోన్న బీజేపీ గేమ్‌ ప్లాన్‌(BJP Game Plan) షురూ చేసింది. ప్రధాని మోదీ ఫేస్‌ ఫిగర్‌గా బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలోనే మోదీ ఎన్నికల శంఖారావన్ని పూరించనున్నారు. మార్చి 4న తెలంగాణకు మోదీ రానున్నారు. 2 రోజుల పాటు రాష్ట్రంలో ప్రధాని టూర్ కొనసాగుతుంది. 4న సంగారెడ్డి, 5న ఆదిలాబాద్‌లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు. ఆ రోజు జరగాల్సిన అమిత్ షా(Amit Shah) ప్రోగ్రాం రద్దు అయ్యింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి తెలంగాణకు మోదీ రానున్నారు.

తెలంగాణ ప్రభుత్వం తరఫున మోదీకి సీఎం రేవంత్‌రెడ్డే స్వయంగా స్వాగతం పలకనున్నారు. మొదటిసారి ఒకే వేదికపై మోదీ, రేవంత్ రెడ్డి(Revanth Reddy) కనిపించనున్నారు. గతంలో ప్రధాని రాష్ట్ర పర్యటనలకు నాటి సీఎం హాజరుకాలేదు. నిజానికి రాష్ట్రానికి ప్రధాని వచ్చినప్పుడు స్వాగతించడం ప్రోటోకాల్‌లో భాగంగా చెబుతుంటారు. మోదీని స్వాగతించకపోవడం ద్వారా కేసీఆర్ వ్యక్తిని కాకుండా సంస్థను అవమానించారంటూ గతంలో కేసీఆర్‌(KCR) పై బీజేపీ(BJP) నేతలు తీవ్ర స్థాయిలో మండిపడేవారు. రాజ్యాంగబద్ధంగా ఫెడరల్ ప్రోటోకాల్‌ను కేసీఆర్ భంగపరిచారని ఫైర్ అయ్యేవారు. అయితే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం లేదు కదా.. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో ప్రధాని రాకకు ప్రాధాన్యత ఏర్పడింది.

Also Read : ఓ వెధవ.. ఓట్ల బిచ్చగాడ.. బండిని పొట్టు పొట్టు తిట్టిన పొన్నం!

Advertisment
Advertisment
తాజా కథనాలు