NITI Aayog: నేడు నీతి ఆయోగ్ భేటీ.. పలు రాష్ట్రాలు బాయ్‌ కాట్‌

నేడు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ 9వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. కాగా ఈ సమావేశాన్ని 7 రాష్ట్రాల సీఎంలు బాయ్‌ కాట్‌ చేశారు.

New Update
NITI Aayog: నేడు నీతి ఆయోగ్ భేటీ.. పలు రాష్ట్రాలు బాయ్‌ కాట్‌

NITI Aayog Meeting: ఈరోజు నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా (నీతి ఆయోగ్) తొమ్మిదో పాలక మండలి సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షత వహించనున్నారు. నీతి ఆయోగ్ అపెక్స్ బాడీ అయిన కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, యూనియన్ లెఫ్టినెంట్ గవర్నర్‌లు ఉన్నారు.

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అయితే, ఎన్డీయే మిత్రపక్షమైన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం తన హాజరును ఇంకా ధృవీకరించలేదు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించారు.

నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతున్నవారు..

* మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే
* ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
* అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండూ
* అరుణాచల్ ఉప ముఖ్యమంత్రి చౌనా మే
* త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా
* అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ
* ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ
* ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి
* గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్
* రాజస్థాన్ ముఖ్యమంత్రి భజజన్‌లాల్ శర్మ
* మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా

బైకాట్ చేసిన సీఎంలు..

* తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్
* హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు
* కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
* తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
* పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్
* కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
* పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి

Also Read: దేశంలో 5 కోట్ల పెండింగ్‌ కేసులు

Advertisment
Advertisment
తాజా కథనాలు