PM Modi Telangana Tour: మోదీ తెలంగాణ టూర్ ఫిక్స్.. పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 1న రాష్ట్ర పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు.

PM Modi Telangana Tour: మోదీ తెలంగాణ టూర్ ఫిక్స్.. పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
New Update

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 1న రాష్ట్ర పర్యటనకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రానున్నారు. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదలైంది. మధ్యాహ్నం 1: 30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి మోదీ చేరుకుంటారు. అనంతరం 1:45 గంటల నుంచి 2:15 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో మోదీ పాల్గొననున్నారు. తర్వాత 2:30 కి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మహబూబ్ నగర్ కు మోదీ బయల్దేరుతారు. తర్వాత 3:05 గంటలకు మహబూబ్ నగర్ చేరుకుంటారు. 3:15 గంటల నుంచి 4:15 గంటల వరకు మహబూబ్ నగర్ లో జరిగే భారీ బహిరంగ సభలో నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత సాయంత్రం 4:30 గంటలకు మహబూబ్ నగర్ నుంచి బయల్దేరి 5:05 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. సాయంత్రం 5:10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి మోదీ తిరుగు ప్రయాణం కానున్నారు.

శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రధాని ఏం మాట్లాడుతారు? తెలంగాణకు ఏమైనా హామీలు ఇస్తారా? అధికార పార్టీపై ఎలాంటి విమర్శలు చేస్తారు? అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రధాని రాష్ట్రాల పర్యటనకు వచ్చిన సమయంలో సాధారణంగా సీఎం స్వాగతం పలుకుతుంటారు.

కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఇటీవల ప్రధానికి స్వాగతం పలకడానికి వెళ్లడం లేదు. ఆయన స్థానంలో ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఎంకు స్వాగతం పలుకుతున్నారు. ఈ సారి పీఎంకు ఎవరు స్వాగతం పలుకుతారన్న అంశంపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలోని బీజేపీ శ్రేణులు ప్రధాని మోదీ పర్యటనపైనే ఆశలు పెట్టుకున్నాయి. ఆయన పర్యటనతో తెలంగాణ బీజేపీలో మళ్లీ జోష్ పెరుగుతుందన్న భావన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. మరో వైపు ప్రధాని సభకు బీజేపీ నాయకులు మహబూబ్ నగర్ లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి:
Kishan Reddy: 6 లక్షల మందికి మోదీ సర్కార్ జాబ్స్.. మరి కేసీఆర్ ప్రభుత్వం సంగతేంటి?: కిషన్ రెడ్డి

#modi #telangana-bjp #g-kishan-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe