బీహార్ అసెంబ్లీలో జనాభా నియంత్రణపై సీఎం నితీష్ కుమార్(CM Nitish Kumar) చేసిన వ్యాఖ్యలు దేశంలో దుమారం లేపాయి. ఆయన నిన్న అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. ఆడవాళ్లు చదువుకుంటే.. భర్తలను కంట్రోల్‌లో పెట్టి జనాభా రేట్‌ను తగ్గిస్తారని అన్నారు. చదువుకున్న స్త్రీలు కలయిక సమయంలో భర్తలను అదుపులో పెడతారని, తద్వారా జనాభా తగ్గుతుందని అన్నారు. మహిళలు చదువుకోవడం వల్లే ఒకప్పుడు 4.3గా ఉన్న జననాల రేటు ప్రస్తుతం 2.9కు పడిపోయిందని, త్వరలోనే 2కు కూడా చేరుకుంటుందని ఎద్దేవా చేశారు.
Also Read: కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం!
బీహార్ సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ(PM Modi) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత కూటమికి(INDIA Alliance) చెందిన ప్రధాన నాయకుడు బిహార్ అసెంబ్లీలో మహిళలపై అసభ్య పదజాలం ప్రయోగించిన భారత కూటమిలోని ఏ నాయకుడు దీనికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇది వారికి ఏమాత్రం అవమానకరంగా కనిపించట్లేదా? అని ప్రశ్నించారు. మహిళల గురించి ఇలా ఆలోచించే వ్యక్తులు మీకు ఏం మంచి చేయగలరు? మన అమ్మా, అక్కాచెల్లెళ్ల పట్ల ఇలాంటి దుర్మార్గపు వైఖరి ఉన్నవాళ్లు మన దేశాన్ని అవమానిస్తున్నారు అని ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు.
Also Read: విద్యార్థులకు GOOD NEWS.. సెలవులు పెంపు!
నితీష్ కుమార్ వ్యాఖ్యలను బీజేపీ(BJP) తీవ్రంగా ఖండించింది. స్త్రీద్వేషి, పితృస్వామ్య స్వభావం అంటూ మండిపడింది. రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలతో నితీష్ కుమార్ ప్రజాస్వామ్యం గౌరవాన్ని కించపరిచారని కేంద్ర మంత్రి అశ్విని కుమార్(Ashwini Kumar) చౌబే దుయ్యబట్టారు.