PM Modi: తెలంగాణలో RR ట్యాక్స్.. రేవంత్ సర్కార్‌పై మోడీ సంచలన వ్యాఖ్యలు

TG: అందోల్ సభలో రేవంత్ సర్కార్ పై విమర్శలు చేశారు ప్రధాని మోడీ. తెలంగాణలో RR ట్యాక్స్ తీసుకొచ్చారని అన్నారు. డబుల్ R ట్యాక్స్ తో నల్లధనం ఢిల్లీ చేరుతోందని ఆరోపణలు చేశారు.

New Update
PM Modi : ఆ సొమ్మంతా పేదలకే పంచి పెడతాం.. మోడీ కీలక వ్యాఖ్యలు!

PM Modi: అందోల్ సభలో రేవంత్ సర్కార్ పై విమర్శలు చేశారు ప్రధాని మోడీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం RR ట్యాక్స్ తీసుకొచ్చిందని అన్నారు. రాష్ట్రంలోని వ్యాపారాలు, కాంట్రాక్టర్లు RR ట్యాక్స్ కడుతున్నారని పేర్కొన్నారు. డబుల్ R ట్యాక్స్ తో నల్లధనం ఢిల్లీ చేరుతోందని ఆరోపణలు చేశారు. RR ఎవరో మీకు అర్ధమై ఉంటుందని వ్యాఖ్యానించారు. RR ట్యాక్స్ ను అడ్డుకోకపోతే సర్వనాశనం తప్పదని హెచ్చరించారు. గతంలో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఫైర్ అయ్యారు. ఇప్పుడు కొత్త అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పనిలో పడిందని అన్నారు.

ALSO READ: టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీలో ఒక గూటి పక్షులే అని అన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు మరో దోపిడీకి సిద్ధమైందని పేర్కొన్నారు. మీపై వారసత్వ పన్ను విధించబోతోంది అని  తెలిపారు. మీ సంపదలో 55% లాక్కుంటామని కాంగ్రెస్ చెప్పకనే చెబుతుంది అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లు అధికారంలో ఉండి పెద్ద స్కాం చేసిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ జరుపుతామని చెప్పి అదికారంలోకి వచ్చిన  కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని అన్నారు.

ఓటుకు నోటు కేసును గతంలో బీఆర్ఎస్ తొక్కిపెట్టిందని అన్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ స్కాం ను కాంగ్రెస్ తొక్కిపెడుతుందని ఆరోపించారు. అవినీతిలో రెండు పార్టీలు భాగస్వాములే అని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఆ మాటే తీయడం లేదని.. రైతులను మోసం చేసిందని అన్నారు.

Advertisment
తాజా కథనాలు