PM MODI: రిజర్వేషన్లకు నెహ్రు వ్యతిరేకి.. మోదీ సంచలన వ్యాఖ్యలు..!!

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మోదీ సమాధానం ఇచ్చారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లను ఆనాడు నెహ్రు వ్యతిరేకించారని మోదీ గుర్తు చేశారు. కావాలంటే రికార్డులను చూడాలని కాంగ్రెస్ ను కోరారు ప్రధాని మోదీ.

PM MODI: రిజర్వేషన్లకు నెహ్రు వ్యతిరేకి.. మోదీ సంచలన వ్యాఖ్యలు..!!
New Update

PM MODI: ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఆనాడు నెహ్రు వ్యతిరేకించారని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. కావాలంటే రికార్డులను చూడాలంటూ కాంగ్రెస్ ను కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మోదీ సమాధానం ఇచ్చారు.అంబేద్కర్ లేకుంటే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు దక్కేవి కావన్నారు ప్రధాని. రిజర్వేషన్లకు తాను వ్యతిరేకమని అప్పట్లో సీఎంలకు నెహ్రు లేఖ రాసిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ఈ లేఖ రికార్డుల్లో కూడా ఉందన్నారు మోదీ. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు దక్కితే ఉద్యోగాల్లో నైపుణ్యత దెబ్బతింటుందని నెహ్రు చెప్పారని మోదీ అన్నారు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లభిస్తే ప్రభుత్వ పని ప్రమాణాలు ఓడిపోతాయని నెహ్రు చెప్పారు అన్నారు. ఇలాంటి ఉదాహరణలతో మీ మనసత్వం అర్థం చేసుకోవచ్చని కాంగ్రెస్ మోదీ ఫైర్ అయ్యారు ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ తీరు ఎండగట్టారు.

ఇది కూడా చదవండి: ఆర్బీఐ పుణ్యమా అంటూ ఈ యాప్‌ లకు భారీగా పెరిగిన డిమాండ్‌!

ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యవహారం ఉంటుందని విమర్శలు గుప్పించారు. కానీ తమ పార్టీ ఎప్పుడూ వారికి ప్రాధాన్యత ఇస్తుందని మోదీ అన్నారు. మొదట దళితులు , ఇప్పుడు ఆదీవాసులకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మన పథకాల లబ్దిదారులు ఎవరు ఎవరని ఆయన ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: నగరవాసులకు గుడ్ న్యూస్ …29 రూపాయల బియ్యం అమ్మేది ఈ ప్రాంతాల్లోనే..!!

#lok-sabha #narendra-modi #rajya-sabha #parliament-budget-sessions #motion-of-thanks-to-the-presidents-address
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe