PM Modi: ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం..

ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు రష్యా అత్యున్నత పౌర పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్'తో  ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్.. మోదీని సత్కరించారు.

PM Modi: ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం..
New Update

ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి అరుదైన గౌరవం దక్కింది. రష్యా అత్యున్నత పౌర పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్'తో  ఆ దేశ అధ్యక్షడు వ్లాదిమీర్ పుతిన్.. మోదీని సత్కరించారు. 2019లో కూడా మాస్కోలో సెయింట్ కేథరీన్స్ హాల్‌లో ప్రధాని మోదీకి పుతిన్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. దాదాపు ఐదేళ్ల తర్వాత మరోసారి మోదీకి ఈ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. రష్యా-భారత్ మధ్య స్నేహపూర్వకమైన, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో మోదీ చేసిన కృషికి గానూ ఈ పురస్కారాన్ని అందించారు.

ఈ పురస్కారం స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. రష్యా అత్యున్నత పౌర పురస్కారంతో తనను సత్కరించినందుకు పుతిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవం నా ఒక్కనికి మాత్రమే కాదని.. 140 కోట్ల భారత ప్రజల సొంతమని వ్యాఖ్యానించారు. అలాగే రష్యా-భారత్ మధ్య శతాబ్దాలుగా ఉన్న స్నేహం, పరస్పర నమ్మకానికి గౌరవమని అన్నారు. గత రెండున్నర దశాబ్దాలుగా.. పుతిన్ నాయకత్వంతో భారత్-రష్యా మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయని అన్నారు. ఇరుదేశాల మధ్య పరస్పర సహాకారం మన ప్రజలకు మంచి భవిష్యత్తు అందించే దిశగా వెళ్తోందన్నారు.

#pm-modi #putin
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe