PM Modi: నా మిత్రుడు ట్రంప్‌పై దాడిని ఖండిస్తున్నాను.. మోదీ ట్వీట్

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై జరిగిన దాడిని ఖండించారు ప్రధాని మోదీ. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు అని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ట్రంప్ పై జరిగిన దాడిని పలు దేశాల ప్రతినిధులు ఖండించారు.

PM Modi: నా  మిత్రుడు ట్రంప్‌పై దాడిని ఖండిస్తున్నాను.. మోదీ ట్వీట్
New Update

PM Modi: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై జరిగిన దాడిని ఖండించారు ప్రధాని మోదీ. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు అని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ట్రంప్ పై జరిగిన దాడిని పలు దేశాల ప్రతినిధులు ఖండించారు. ప్రధాని మోదీ ట్విట్టర్ (X)లో.. "నా స్నేహితుడు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మా ఆలోచనలు, ప్రార్థనలు మరణించిన వారి కుటుంబానికి, గాయపడిన వారికి, అమెరికన్ ప్రజలకు ఉన్నాయి." అంటూ రాసుకొచ్చారు.

అసలేం జరిగింది..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై దుండగులు కాల్పులు జరిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో నిర్వహించిన ర్యాలీలో శనివారం ట్రంప్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదిక పై ఆయన ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా ఆయన పై కాల్పులు జరిగాయి. దీంతో బుల్లెట్‌ ఆయన కుడి చెవికి తాకింది.

గాయపడిన ట్రంప్‌ను సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని భద్రతా సిబ్బంది హతమార్చినట్లు సమాచారం. ప్రస్తుతం ట్రంప్‌ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. కాగా, ఈ దాడిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ కాల్పుల ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Also Read: కొద్దిసేపట్లో తెరుచుకోనున్న పూరి జగన్నాథుడి రత్న భాండాగారం

#pm-modi #latest-news-in-telugu #donald-trump
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe