Survey: అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా మరోసారి మోదీ

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా భారత ప్రధాని మోదీ ఇప్పటికే చాలాసార్లు ఎన్నికయ్యారు. ఇప్పుడు మళ్ళీ మరోసారి అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో మోదీ మొదటి స్థానంలో నిలిచారు.

Handloom Day : ఆగస్టు 7న ఆ దుస్తులే కొనండి.. దేశ ప్రజలకు మోదీ పిలుపు!
New Update

PM Modi: ఎన్నేళ్ళయినా మోదీ చరిష్మా మాత్రం తగ్గడం లేదు. ప్రపంచ అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా మోదీ ఆల్రెడీ ఫేమస్ అయ్యారు. ఇప్పుడు మరోసారి మళ్ళీ ఆయనే మొదటి స్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో 69శాతం ఓట్లతో ప్రధాని మోదీ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ఒబ్రేడర్‌ 63 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో మొత్తం 25 మంది నేతలను షార్ట్ లిస్ట్ చేశారు. ఇందులో అందరికన్నా చిట్ట చివరి స్థానంలో జపాన్ ప్రధాని పుమియో కిషిదా ఉన్నారు. ఇక ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ బైడెన్‌కు 39శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఏడాది జులై 8-14 మధ్య ప్రతి దేశంలోనూ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి మార్నింగ్ కన్సల్ట్ సర్వే సంస్థ ఈ జాబితాను విడుదల చేసింది.

టాప్‌ దేశాధినేతలు..

భారత ప్రధాని- నరేంద్ర మోదీ (69 శాతం)

మెక్సికో అధ్యక్షుడు- లోపెజ్‌ ఒబ్రేడర్‌ (63)

అర్జెంటీనా అధ్యక్షుడు- జేవియర్‌ మిలి (60)

స్విట్జర్‌లాండ్‌ అధ్యక్షుడు- వియోల్‌ అమ్హెర్డ్‌ (52)

ఐర్లాండ్‌ ప్రధాని- సైమన్‌ హారిస్‌ (47)

యూకే ప్రధాని- కీర్‌ స్టార్మర్ (45)

పోలాండ్‌ ప్రధాని- డొనాల్ట్‌ టస్క్‌ (45)

ఆస్ట్రేలియా ప్రధాని- ఆంథోని అల్బనీస్‌ (42)

స్పెయిన్‌ ప్రధాని- పెడ్రో శాంచెజ్‌ (40)

ఇటలీ ప్రధాని - జార్జియా మెలోని (40)

అమెరికా అధ్యక్షుడు- జోబైడెన్‌ (39)

కెనడా ప్రధాని- జస్టిన్‌ ట్రూడో (29)

Also Read:Delhi: ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

#popular-leader #survey #pm-modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe