Modi Nizamabad Tour: ప్రధాని మోదీ రేపు మరో సారి తెలంగాణలో (PM Modi Telangana Tour) పర్యటించనున్నారు. నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది. ఆ జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధాని మధ్యాహ్నం 2:10 గంటలకు బీదర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. 2:55 గంటలకు బీదర్ ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ కు చేరుకుంటారు మోదీ. 3:00 నుంచి 3:35 వరకు వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 3:45 నుంచి 4:45 వరకు పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. తర్వాత 4:55 గంటలకు నిజామాబాద్ నుంచి 5:45 గంటలకు బీదర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు ప్రధాని.
ఇది కూడా చదవండి: Telangana Turmeric Board: తెలంగాణపై ప్రధాని వరాల జల్లు.. పసుపు బోర్డు ప్రకటన..
నిజామాబాద్ రైతులు ఏళ్లుగా పసుబు బోర్డు కోసం ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నిన్న మహబూబ్ నగర్ పర్యటన సందర్భంగా పసుపు బోర్డు (National Turmeric Board) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయా రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో రేపు ప్రధాని నిజామాబాద్ పర్యటన ప్రత్యేకతను సంతరించకుంది.
పసుపు రైతులు రేపు మోదీకి ఘన స్వాగతం పలికే అవకాశం ఉంది. ఇంకా కొందరు రైతు నేతలు ప్రధానిని (PM Modi) నేరుగా కలిసి పసుపు బోర్డును ప్రకటించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) ఆధ్వర్యంలో మోదీ నిజామాబాద్ పర్యటనకు సంబంధించి ఘనంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.
Also Read: ఈ నెల 6న బీజేపీ అభ్యర్థుల జాబితా.. ఆ స్థానాలకు అభ్యర్థులు ఖరారు?