BJP : సంగారెడ్డి జిల్లా(Sangareddy District) పటేల్‌గూడలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోడీ గ్యారంటీ అంటే అమలయ్యే గ్యారంటీ అని అన్నారు. బహిరంగ మోడీ ఏమైనా చెబితే చేసి చూపిస్తాడని, ఆర్టికల్ 370(Article 370) రద్దు చేసి మాట నిలబెట్టుకున్నట్లు తెలిపారు. ఆర్టికల్ 370పై సినిమా కూడా రూపొందిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
గ్యారంటీ ఇస్తున్నా.. రాసుకోండి..
ఈ మేరకు విదేశాల్లో చాలామంది తెలుగు వారు ఉన్నారన్న మోడీ.. మన వాళ్లను విదేశాల్లో చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. అయోధ్య(Ayodhya) లో రాముడికి స్వాగతం పలికామని చెప్పారు. రామాలయంపై మోడీ గ్యారంటీ పూర్తి అయిందా.. లేదా? అని ప్రజలను అడిగారు. ఆర్థిక అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభించామంటూ.. 'ఈ రోజు నేను మీకో గ్యారంటీ ఇస్తున్నా. రాసిపెట్టుకోండి' అన్నారు. ప్రపంచంలో దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని చెప్పారు. ఈ మాట కూడా నిలబెట్టుకుంటాని, ఇది మోడీ గ్యారంటీ అని చెప్పారు. ఇక రూ.వేల కోట్ల అవినీతిని బయటపెడుతున్నందుకే తనపై విమర్శలు చేస్తున్నారన్నాని, తాను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. కుటుంబ పాలనతో రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని ప్రధాని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన ప్రకటన!
ప్రపంచానికి ఆశాకిరణం..
అలాగే కశ్మీర్ నుంచి తమిళనాడు వరకు కుటుంబ పాలన ఉన్న రాష్ట్రాల్లో కుటుంబాలే బాగుపడ్డాయని విమర్శలు చేశారు. మోడీని విమర్శించడమే సిద్ధాంతమపరమైన పోరాటమా? అని విపక్షాలను ప్రశ్నించారు. కొందరికి కుటుంబమే ముఖ్యం.. నాకు దేశం ముఖ్యమని చెప్పారు. కుటుంబ పార్టీలకు ఏమైనా లైసెన్స్ లు ఇచ్చారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ బాగుకోసమే వాళ్ల భాద అని, కుటుంబ వాదులు దేశ రాజకీయాల్లో యువతను ఎదగనీయలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మీ అశీర్వాదాలు వృథా కానివ్వను. ఇది మోడీ గ్యారంటీ' అంటూ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. చివరగా భారత్ ప్రపంచానికి ఆశాకిరణంలా మారిందని చెప్పిన ప్రధాని.. భారత్ ను ప్రపంచంలో సరికొత్త శిఖరాలకు చేర్చాలని సూచించారు.
జెల్లో పెట్టడం ఖాయమే..
ఇక మేమంతా మోదీ కుటుంబమే అని తెలంగాణ ప్రజలు(Telangana People) అంటున్నారని చెప్పారు. రాష్ట్ర యువత కలలను సాకారం చేస్తానని, 70 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పనిని పదేళ్లలో చేసి చూపించామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, ఆ పార్టీలు కుమ్మక్కయ్యాయని ప్రజలందరికీ అర్థమైందని చెప్పారు. అవినీతిపరులను బీజేపీ అసలే వదిలిపెట్టదని, ఒక్కొక్కిరినీ జైల్లో పెట్టడం ఖాయమన్నారు. ఇక కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. తెలంగాణలో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందని తెలిపారు.