Modi : దేశపు అతిపెద్ద ఎనర్జీ ఎగ్జిబిషన్.. టూరిస్ట్ స్టేట్‌కు మోదీ గిఫ్ట్!

ప్రధాని నరేంద్ర మోదీ గోవాలో పర్యటించనున్నారు. ఇండియా ఎనర్జీ వీక్-2024ను ప్రారంభించనున్నారు. అలాగే 1,350 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌ను ఆయన జాతికి అంకితం చేయనున్నారు.

Modi : దేశపు అతిపెద్ద ఎనర్జీ ఎగ్జిబిషన్.. టూరిస్ట్ స్టేట్‌కు మోదీ గిఫ్ట్!
New Update

Modi Goa Tour : ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) నేడు(ఫిబ్రవరీ 6) గోవాలో పర్యటించనున్నారు. తన పర్యటన సందర్భంగా గోవా(Goa) కు రూ.1330 కోట్ల విలువైన పథకాలను బహుమతిగా ఇవ్వనున్నారు. గోవాలో ఇండియా ఎనర్జీ వీక్-2024(India Energy Week - 2024) ను మోదీ ప్రారంభించనున్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT) శాశ్వత క్యాంపస్‌ను దేశానికి అంకితం చేయనున్నారు. డెవలప్ ఇండియా, డెవలప్ గోవా-2047 కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తారు. గోవాలో ఓఎన్‌జీసీ-సీ సర్వైవల్ సెంటర్‌ను మోదీ ప్రారంభించనున్నారు. దక్షిణ గోవాలోని బేతుల్ గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

సీఈవోలతో మోదీ భేటీ :

ఇంధన అవసరాల విషయంలో స్వావలంబనపైనే ప్రధాని మోదీ దృష్టి కేంద్రీకరించినట్లు పీఎంవో నుంచి విడుదలైన ప్రకటన పేర్కొంది. ఇండియా ఎనర్జీ వీక్-2024 ఈ దిశలో తీసుకున్న ఒక అడుగుగా అర్థమవుతుంది. ఇది ఇవాళ్టి(ఫిబ్రవరి 6) నుంచి ఫిబ్రవరి 9 వరకు గోవాలో జరుగుతుంది. ఇండియా ఎనర్జీ వీక్-2024 దేశపు అతిపెద్ద ఎనర్జీ ఎగ్జిబిషన్. ఇక ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ చమురు, గ్యాస్ కంపెనీల సీఈవోలు, నిపుణులతో ప్రధాని సమావేశం కానున్నారు. వివిధ దేశాల నుంచి 17 మంది ఇంధన మంత్రులు, 35 వేల మందికి పైగా సందర్శకులు రానున్నారు. 900 కంటే ఎక్కువ ప్రదర్శనలు ఇండియా ఎనర్జీ వీక్‌లో కనిపించనున్నాయి. ఎనర్జీ వీక్‌లో కెనడా, జర్మనీ, నెదర్లాండ్స్, రష్యా, బ్రిటన్, అమెరికాకు చెందిన పెద్దలు కూడా ఉంటారు.

గోవా పర్యటన సందర్భంగా మోదీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాటర్‌ స్పోర్ట్స్‌(NIWS) ను ప్రజలకు అంకితం చేయనున్నారు. ఇందులో వాటర్ స్పోర్ట్స్(Water Sports), వాటర్ రెస్క్యూ(Water Rescue) కార్యకలాపాలకు సౌకర్యాలు కల్పించారు. ఈ సౌకర్యాలు సామాన్య ప్రజలతో పాటు భద్రతా దళాలకు అందుబాటులో ఉంటాయి.

Also Read : బాత్‌రూమ్‌లోకి ఫోన్‌ తీసుకెళ్తున్నారా..ఈ అనర్థాలు తప్పవు

WATCH:

#india-energy-week-2024 #nit #goa #narendra-modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe