PM Modi : 45 ఏళ్ళలో మొదటిసారి పోలాండ్‌లో అడుగుపెట్టిన ప్రధాని విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పోలాండ్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. భారత్–పోలాండ్ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ ఈ దేశంలో పర్యటిస్తున్నారు. By Manogna alamuru 21 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి PM Modi Poland Visit : 45 ఏళ్ళల్లో భారత ప్రధాని మొదటిసారిగా పోలాండ్ (Poland) పర్యటిస్తున్నారు. చివరిసారిగా 1979లో భారత మాజీ ప్రధాని మోరార్జీ దేశాయ్ (Morarji Desai) ఆ దేశానికి వెళ్ళారు. ప్రస్తుతం భారత్–పోలాండ్ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగానే ప్రధాని మోదీ (PM Modi) పోలాండ్‌లో పర్యటిస్తున్నారు. ఆ దేశంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో మోడీకి స్వాగతం పలికారు. ఈ పర్యటన భారతదేశం-పోలాండ్ స్నేహానికి ఊపందుకుంటుందని… ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని మోదీ అన్నారు. పోలాండ్ పర్యటన విశేషాలను తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ రోజంతా ఇక్కడే గడిపిన మోదీ రేపు ఉక్రెయిన్‌కు వెళ్ళనున్నారు. Landed in Poland. Looking forward to the various programmes here. This visit will add momentum to the India-Poland friendship and benefit the people of our nations. pic.twitter.com/KniZnr4x8g — Narendra Modi (@narendramodi) August 21, 2024 పోలాండ్ నుంచి ఉక్రెయిన్ (Ukraine) కు ప్రధాని మోదీ ట్రైన్‌లో వెళ్ళనున్నారు. దాదాపు పది గంటలపాటూ ప్రయాణం చేసి మదీ ఉక్రెయిన్లోని కీవ్‌ను చేరుకుంటారు. అత్యంత సురక్షితమైన రైలుగా పేరు గాంచిన ట్రైన్ ఫోర్స్ వన్‌లో ప్రధాని మోదీ ప్రయాణిస్తున్నారు. రష్యా–ఉరెయిన్ యుద్ధం మొదలైన దగ్గర నుంచీ ప్రపంచ దేశాధినేతలు అందరూ ఈ ట్రైన్ ఫోర్స్ వన్‌లోనే ప్రయాణించడం గమనార్హం. కీవ్‌కు వెళ్ళడానికి విమానాలు అంత సురక్షితం కాకపోవడంతో దేశాధినేతలు అందరూ ట్రైన్ ప్రయాణాలు చేస్తున్నారు. అందుకే ఈ రైలు పేరు ట్రైన్ ఫోర్స్ వన్ లేదా రైల్ ఫోర్స్ వన్‌గా మారిపోయింది. అంతేకాకుండా ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభం అయిన సమయంలో లక్షలాది మంది ఉక్రెయిన్ వాసులను సురక్షిత ప్రాంతాలకు ఈ రైలు తరలించింది. ఇప్పుడు దౌత్యపరమైన చర్చలకు ఇదే లైఫ్‌లైన్‌గా మారింది. ఇక ఈ ట్రైన్ ఫోర్స్ వన్ రైలులో విలాసవంతమైన క్యాబిన్లు ఉంటాయి. సమావేశాల కోసం పెద్ద పెద్ద టేబుల్స్, సోఫా, టీవీతో పాటు రెస్ట్ తీసుకునేందుకు సౌకర్యవంతమైన బెడ్ రూమ్ కూడా ఉంది. ఈ ట్రైన్ అత్యంత పకడ్బందీ సెక్యూరిటీ మధ్యలో నడుస్తుంది. మరోవైపు యుద్ధం నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే రష్యాలో పర్యటించిన ప్రధాని మోదీ ఇప్పుడు ఉక్రెయిన్ కూడా పర్యటిస్తుండడంతో ప్రపంచ దేశాల్లో ఆసక్తి నెలకొంది. కీవ్ చేరుకున్నాక ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమై తిరిగి మళ్లీ రైలు మార్గంలోనే పోలెండ్ చేరుకుంటారు. అక్కడి నుంచి తిరిగి భారత్‌కు వస్తారు. Also Read: Andhra Pradesh: రెండోసారి పోలీసు విచారణకు జోగి రమేష్ హాజరు #pm-modi #ukraine #poland-visit మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి