PM Kisan Update : రైతులకు అలెర్ట్.. పీఎం కిసాన్‌ 17వ నిధుల విడుదలపై కీలక్‌ అప్‌డేట్‌!

పీఎం కిసాన్‌ నిధులు పొందాలనుకునే రైతులకు ఓ గుడ్‌ న్యూస్‌ ఈ సారి పీఎం కిసాన్‌ 17వ విడతను కేంద్రం జూన్లో రిలీజ్ చేయవచ్చు. ఈ పథకం ద్వారా కేంద్రం ప్రతీ ఏడాది రైతులకు రూ.6వేల ఆర్థిక సహాయం అందిస్తోంది.

New Update
PM Kisan Update : రైతులకు అలెర్ట్.. పీఎం కిసాన్‌ 17వ నిధుల విడుదలపై కీలక్‌ అప్‌డేట్‌!

PM Kisan : పేద ప్రజలకు సహాయం చేయడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల ప్రజల కోసం ఈ పథకాలను నిర్వహిస్తుండగా, మరోవైపు కేంద్ర ప్రభుత్వం(Central Government) దేశ ప్రజల కోసం ఈ పథకాలను అమలు చేస్తోంది. అలాంటి ఒక పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(PM Kisan Samman Nidhi Yojana). ఈ పథకంలో రైతులకు ఆర్థిక సహాయం అందజేయగా, ప్రతి నాలుగు నెలలకు రూ.2-2 వేలు విడతగా అందజేస్తారు.

ఇప్పుడు ఈ క్ర‌మంలో 17వ విడత విడుద‌ల కానుంది. దీని కోసం కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. కాబట్టి 17వ వాయిదా ఎప్పుడు విడుదల అవుతుందో తెలుసుకుందాం..

వాస్తవానికి, ప్రధానమంత్రి కిసాన్ యోజన పేద, నిరుపేద రైతుల(Farmers) కోసం కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఇందులో వారికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. పథకం కింద ఏటా రూ.6వేలు ఇస్తుండగా, ఈ సొమ్మును ఒక్కొక్కరికి రూ.2వేలు చొప్పున మూడు విడతలుగా అందజేస్తారు.

16వ విడత 2024 ఫిబ్రవరి 28న విడుదలైంది. ఇందులో 16వ విడత సొమ్ము 9 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతా(Bank Account) లకు బదిలీ చేసింది. డీబీటీ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా వాయిదాల సొమ్మును పంపించారు. నిబంధనల ప్రకారం, ప్రతి వాయిదాకు డబ్బు 4 నెలల వ్యవధిలో విడుదల చేయడం జరుగుతుంది. ఉదాహరణకు, 16వ విడత 28 ఫిబ్రవరి 2024న విడుదలైంది.

ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఈ సారి నిధులు జూన్‌లో 17వ విడత విడుదల కావచ్చు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.జూన్ 4, 2024 (ఎన్నికల ఫలితాల విడుదల తేదీ) తర్వాత ఎప్పుడైనా విడుదల చేయవచ్చు. ఈ సమాచారాన్ని ప్రభుత్వం ముందుగానే అందజేస్తుంది.

దేశవ్యాప్తంగా కొంతమంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలను తప్పుగా పొందుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అంటే అర్హత ఉన్నవాళ్లు కొన్ని నిబంధనలు పాటించడం లేదు. దీని కారణంగా వాళ్లు నిధులు పొందలేకపోతున్నారు. మరికొందరు దొడ్డిదారిన పొందుతున్నారని తెలుస్తోంది. అందుకే కేంద్రం ప్రత్యేక నిబంధనలు పెట్టింది. ఇ-కేవైసీ, భూమి రికార్డుల వెరిఫికేషన్ చేయడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది.

–> మీరు 17వ విడత ప్రయోజనం పొందాలనుకుంటే e-KYC, భూమి రికార్డులను వీలైనంత త్వరగా పథకంలో ధృవీకరించాలి.

–> మీరు ఈ రెండు ముఖ్యమైన పనులను పూర్తి చేయకపోతే తదుపరి 17వ విడత ప్రయోజనం పొందలేరు. ఇది కాకుండా, పథకానికి దరఖాస్తు చేసేటప్పుడు ఏదైనా తప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తే 17వ విడత ప్రయోజనం లభించదు.

Also Read : ఆ దాడులు చేసినవారు ఇస్లామిక్‌ రాడికల్స్‌…కానీ ఉక్రెయిన్‌..!

Advertisment
తాజా కథనాలు