PM Kisan: రైతులకు మోదీ సర్కార్ తీపికబురు..ఆ రోజే 16వ విడత పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో జమ..!!

మోదీ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 16వ విడత డబ్బులు జమ కావాలంటే ఫిబ్రవరి 20వ తేదీలోపు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. అయితే పీఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే ఈ కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలి.

PM Kisan: రైతులకు మోదీ సర్కార్ తీపికబురు..ఆ రోజే 16వ విడత పీఎం కిసాన్ డబ్బులు  అకౌంట్లో జమ..!!
New Update

PM Kisan: కేంద్రంలోని మోదీ సర్కార్ పేదల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాల్లో ఒక్కటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ స్కీం కింద ఏడాదిలో రైతుల ఖాతాలో 6వేల రూపాయలు జమ అవుతాయి. ఈ స్కీం ప్రారంభించినప్పటి నుంచి కేంద్రం 15వాయిదాలను రైతుల అకౌంట్లో జమ చేసింది. ఒక్కొక్కరికి రూ. 2వేల చొప్పున సర్కార్ ఏడాదికి 3సార్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తోంది.

నవంబర్ 15, 2023వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ 15వ విడత కిసాన్ యోజనను బదిలీ చేసింది. దేశవ్యాప్తంగా 8కోట్ల మంది రైతులకు ఈ నగదు జమ చేశారు. ఇప్పుడు 16 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయని రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోదీ సర్కార్ ఫిబ్రవరి చివరి వారంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీం కింద 16వ విడత డబ్బును రిలీజ్ చేయనున్నారు. అయితే పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా ఉండాలి.

దీనికి ఫిబ్రవరి 20వ తేదీ చివరి గడువుగా పేర్కొన్నారు. ఈ లోపే కేవైసీ చేయించుకుంటేనే 16వ విడత డబ్బులు జమ అవుతాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అనేది కేంద్రం అమలు చేస్తున్న పథకం. దీని ద్వారా సర్కార్ పేద రైతుల అకౌంట్లోకి ప్రతిఏటా మూడు విడతలుగా మొత్తం ఆరువేల రూపాయలను జమ చేస్తుంది. మీరు కూడా పీఎం కిసాన్ స్కీం ప్రయోజనాలను పొందాలంటే మీరు స్కీం కోసం ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఇది కూడా చదవండి: ఏపీలోని 12 లక్షల మంది విద్యార్థులకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త..!!

#pm-kisan #pm-kisan-yojana-nidhi #pm-kisan-samman-nidhi-16th-installment
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe