PM Kisan Funds: రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. పీఎం కిసాన్ నిధులు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు విడుదల చేసింది. 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా దాదాపు రూ.20,000 కోట్లతో పీఎం-కిసాన్ 17వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వారణాసిలో రిలీజ్ చేశారు. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకునేందుకు ఆర్టికల్ లోకి వెళ్లండి.

PM Kisan Funds: రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. పీఎం కిసాన్ నిధులు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!
New Update

PM Modi Released PM Kisan Funds: ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ నిధులు విడుదల చేశారు. 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా దాదాపు రూ.20,000 కోట్లతో పీఎం-కిసాన్ 17వ విడతను వారణాసి (Varanasi) వేదికగా విడుదల చేశారు. అలాగే పాక్షిక విస్తరణ కార్మికులుగా పనిచేసేందుకు ‘వ్యవసాయ (కృషి) సఖి’ శిక్షణ పొందిన 30,000 మందికిపైగా స్వయం సహాయ సంఘాల మహిళలకు ధ్రువీకరణ పత్రాలను కూడా ప్రధానమంత్రి ప్రదానం చేశారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు.

2.5 కోట్ల మందికిపైగా రైతులు..
దేశవ్యాప్తంగా గల 732 వ్యవసాయాభివృద్ధి కేంద్రాలు (కెవికె), లక్షకుపైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల సార్వత్రిక సేవా కేంద్రాల ద్వారా మొత్తం 2.5 కోట్ల మందికిపైగా రైతులు కూడా వాస్తవిక సాదృశ మాధ్యమం ద్వారా ఇందులో పాలుపంచుకుంటారు. మరోవైపు ఎంపిక చేసిన 50 ‘కెవికె‘లలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలోనూ రైతులు గణనీయ సంఖ్యలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలువురు కేంద్రమంత్రులు ఆయా కేంద్రాలను సందర్శించి రైతులతో సంభాషిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే రైతులకు ఉత్తమ వ్యవసాయ పద్ధతులు, ఈ రంగంలో వర్ధమాన కొత్త సాంకేతికతలు, వాతావరణ ప్రతికూలతలను తట్టుకోగల వ్యవసాయం తదితరాలపై అవగాహన కల్పిస్తారు.

స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి:
ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను (https://pmkisan.gov.in/) సందర్శించాలి. పేజీ కుడి వైపు ‘నో యువర్ స్టేటస్’ ట్యాబ్‌పై క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చా కోడ్‌ ఎంటర్ చేయండి. మీ ఎంపికను ఎంచుకుంటే మీ స్టేటస్ డిస్‌ప్లే అవుతుంది. ఆ తర్వాత జాబితాలో పేరు తనిఖీ ఇలా చూసుకోండి. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అందులోని ‘బెనిఫిషియరీ లిస్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. తర్వాత డ్రాప్-డౌన్ నుంచిరాష్ట్రం, జిల్లా, ఉప-జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలను ఎంచుకోవాలి. అనంతరం ‘గెట్ రిపోర్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. వెంటనే లబ్ధిదారుల జాబితా వివరాలు డిస్‌ప్లే అవుతాయి.

ఈ-కేవైసీ..
పీఎం-కిసాన్ వాయిదాలను స్వీకరించడానికి రైతులు తప్పనిసరిగా వారి ఈ-కేవైసీ పూర్తి చేయాలి. ఈ పథకానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ ప్రకారం పీఎం-కిసాన్ నమోదిత రైతులకు ఈ-కేవైసీ తప్పనిసరి. ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ పీఎం కిసాన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ కోసం సమీప సీఎస్‌సీ కేంద్రాలను సంప్రదించవచ్చు.

#pm-modi #pm-kisan-funds #released-pm-modi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe